E-Paper
Advertisement

Raj Tarun: మస్తాన్ అనే వ్యక్తితో లావణ్యకు సంబంధం ఉంది: ప్రేయసి ఫిర్యాదుపై స్పందించిన రాజ్ తరుణ్

Raj Tarun: మస్తాన్ అనే వ్యక్తితో లావణ్యకు సంబంధం ఉంది: ప్రేయసి ఫిర్యాదుపై స్పందించిన రాజ్ తరుణ్
Advertisement
Raj Tarun reacts to Lavanya allegations: నటుడు రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు చేసుకోనని అంటున్నాడని లావణ్య తాజాగా నార్సింగ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై నటుడు రాజ్ తరుణ్ తాజాగా స్పందించాడు. 11 ఏళ్లుగా మీరిద్దరూ కలిసి రిలేషన్‌లో ఉన్నారని లావణ్య ఫిర్యాదులో పేర్కోవటం నిజమేనా అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్.. లావణ్యకు తనకు కేవలం పరిచయం మాత్రమే ఉండేదని అన్నాడు.
అయితే 8 నెలల క్రితం మస్తాన్ సాయి అనే అబ్బాయి మీద కూడా ఇలాగే ఫిర్యాదు చేసిందని అన్నాడు. ఆ ఫిర్యాదులో కూడా మస్తాన్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని లావణ్య కంప్లైట్ చేసిందని చెప్పుకొచ్చాడు. అయితే లావణ్య ప్రస్తుతం మస్తాన్ సాయి అనే వ్యక్తితోనే రిలేషన్‌లో ఉందని తెలిపాడు. కాగా ఇప్పుడు లావణ్య తన ఫ్లాట్ లోనే ఉంటుందని అన్నాడు. అయితే ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉండటంతో ఆమెనుంచి బయటకు వచ్చేశానని అన్నాడు.

ఈ విషయంపై పోలీసులకు చెబితే తన రెపుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పలేదని తెలిపాడు. అయితే గుడిలో పెళ్లి చేసుకున్నామని ఆమె ఫిర్యాదులో పెర్కొనడంపై కూడా స్పందించాడు. ఆమె ఒకసారి పెళ్లి చేసుకున్నానని చెబుతుందని.. మరోసారి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెబుతోందని అన్నాడు. అంతేకాకుండా లావణ్యతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని కూడా తెలిపాడు. అయితే లావణ్యతో రెండు మూడేళ్లు రిలేషన్‌షిప్ ఉండేదని.. ఆ తర్వాత అలాంటిదేమి లేదని తెలిపాడు. లావణ్యను పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని అన్నాడు. పెళ్లి విషయంలో తానెప్పుడూ లావణ్యకు మాట ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు.

అయితే డ్రగ్స్ కేసులో తనను ఇరికించారని లావణ్య ఫిర్యాదులో పేర్కొనడంపై మాట్లాడుతూ.. ఆ ఆరోపణలో ఎలాంటి నిజం లేదని అన్నాడు. ఆమెను తను డ్రగ్స్ కేసులో ఇరికించే ఉద్దేశం ఉంటే.. నాకీ పరిస్థితి ఉండేది కాదు కదా?అని చెప్పుకొచ్చాడు. ఆమె తనను ఇబ్బంది పెడుతుండటంతో తాను లీగల్ కన్సల్టింగ్ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె తనపై ఆరోపణలు, ఫిర్యాదు చేసిందని తెలిపాడు.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×