BigTV English

Vivo T3 Lite Price Sale: బడ్జెట్ ప్రీమియం.. రూ. 9,999కే 5G ఫోన్.. ఆఫర్లు లోడింగ్..!

Vivo T3 Lite Price Sale: బడ్జెట్ ప్రీమియం.. రూ. 9,999కే 5G ఫోన్.. ఆఫర్లు లోడింగ్..!

Vivo T3 Lite Price and Features: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Vivo T3 లైట్‌ను ఒక వారం క్రితం భారతదేశంలో విడుదల చేసింది. ఫోన్ ఈ రోజు నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చింది. Vivo మార్చి 2024లో Vivo T3 సక్సెసర్‌గా T3 Lite స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది. దీని ముందు మోడల్‌లో ఎటువంటి ఫీచర్లు అయితే ఉన్నాయో దీనిలోనూ అవే ఉంటాయి. ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లో మెడిటెక్ Dimensity 6300 చిప్‌సెట్‌ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ AIతో 50 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.


Vivo T3 Lite
Vivo T3 Lite ఈ రోజు నుండి కొనుగోలు చేయడానికి Flipkartలో అందుబాటులో ఉంది. Vivo T3 Lite స్మార్ట్‌‌ఫోన్ 4GB RAM +128GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వెనిలా మోడల్ ధర రూ. 10,499, 6GB + 128GB స్టోరేజ్ గల మోడల్ ధర రూ. 11,499. కంపెనీ ఈ ఫోన్‌ను మెజెస్టిక్ బ్లాక్, వైబ్రంట్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది.

ఇది కాకుండా కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫోన్ కొనుగోలు చేయడంపై 5 శాతం తగ్గింపును ఇస్తోంది. ఇది కాకుండా వివో హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ. 500 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అంటే ఆఫర్ తర్వాత T3 Lite 5G ఫోన్ ప్రారంభ ధర రూ.9,999 అవుతుంది.


Also Read: అదరగొట్టావ్.. వన్‌ప్లస్ కొత్త ఫోన్.. కెవ్ అనిపిస్తున్న కెమెరా డిజైన్!

Vivo T3 Lite Features
Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ బాక్సీ లుక్‌తో వస్తుంది. వెనుక ప్యానెల్‌లో Vivo T3 Lite 5G రెక్టాంగిల్ ఐస్‌లైన్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ పైభాగంలో స్పీకర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. వాటర్. డస్ట్ నుంచి ప్రొటక్షన్ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.

Vivo T3 Lite 5Gలో ఫోటోగ్రఫీ కోసం సోనీ కెమెరా లెన్స్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. కెమెరాలో AI ఫీచర్లు కూడా ఉన్నాయి. పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ కోసం స్మార్ట్‌ఫోన్‌లో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఉంది. ముందు భాగంలో 8MP HD సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది డ్యూయల్-మోడ్ 5G కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. ఇది నాన్-స్టాండలోన్ నెట్‌వర్క్ సపోర్ట్‌ను అందిస్తుంది.

Also Read: ఆఫర్లు వచ్చాయ్.. కాస్ట్‌లీ ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్..!

అంతే కాకుండా ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్‌లో MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ఉంటుంది. ఈ చిప్‌సెట్ బడ్జెట్ విభాగంలో రియల్‌మీ నార్జో ఎన్65, రియల్‌మీ సి65 5Gతో సహా ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తున్న Vivo Funtouch OS 14తో రన్ అవుతుంది.

Related News

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×