BigTV English

Raj Tarun Purushothamudu Trailer: వక్తి పేరులో రాముడు ఉండటం కాదు.. వ్యక్తిత్వంలో రాముడుండాలి.. రాజ్ తరుణ్ కొత్త మూవీ ట్రైలర్

Raj Tarun Purushothamudu Trailer: వక్తి పేరులో రాముడు ఉండటం కాదు.. వ్యక్తిత్వంలో రాముడుండాలి.. రాజ్ తరుణ్ కొత్త మూవీ ట్రైలర్

Raj Tarun Purushothamudu Trailer: రాజ్ తరుణ్ ప్రస్తుతం చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. తన మాజీ ప్రియురాలు లావణ్య అతడిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని.. ఇప్పుడు మరొక నటి మాల్వీ మల్హోత్రాతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తనను శరీరకంగా కూడా వాడుకున్నాడని.. ప్రెగ్నెంట్ కూడా చేశాడని.. అయితే 2 నెలల్లో సర్జరీ చేయించాడని కూడా తెలిపింది. అయితే ఆ ఆరోపణలపై రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. అవన్నీ అవాస్తవాలేనని.. లావణ్యతో తనకు ఎప్పుడో బ్రేకప్ అయిపోయిందని లేనిపోని ఆరోపణలు చేస్తుందని మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు.


అలా రాజ్ తరుణ్ – లావణ్యల ప్రేమ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది. ఇక తాజాగా రాజ్ తరుణ్, అతడి ప్రస్తుత ప్రియురాలు మాల్వీ మల్హోత్రా కలిసి చేసుకున్న వాట్సాప్ చాటింగ్ లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో 2023లో రాజ్ తరుణ్ మాల్వీకి ప్రపోజ్ చేయగా ఆమె వెంటనే ఓకే చెప్పడం.. అలాగే వీరిద్దరూ తరచూ కోయంబత్తూర్‌లోని ఓ హూటల్‌లో కలవడం.. డైలీ వీడియో కాల్స్, చాటింగ్, ఫోన్ కాల్స్ చేసుకోవడం వంటివి ఈ లీక్ అయిన చాటింగ్ ద్వారా బయటకొచ్చింది. దీంతో లావణ్య చేసిన ఆరోపణలు నిజమేనని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు.

Also Read:  చాట్ లీక్.. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా బండారం బయటపడింది.. రోజూ ఆ హోటల్‌లో..!


ఇలా రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ట్రెండింగ్‌లో నిలుస్తుంది. ఇలాంటి సమయంలోనే రాజ్ తరుణ్‌కి సంబంధించిన పలు సినిమాల అప్డేట్‌లను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీల్లో ‘పురుషోత్తముడు’ ఒకటి. ఈ చిత్రానికి రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హాసిని సుధీర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రకారం చూస్తే.. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా అనిపిస్తుంది.

ఈ ట్రైలర్ ప్రకారం.. ముందుగా యాక్షన్ సన్నివేశాన్ని చూపించారు. ఆ తర్వాత సూటు బూటు వేసుకుని చాలా రిచ్‌గా కనిపించిన రాజ్ తరుణ్ నెక్స్ట్ సీన్‌లో ఒక మిడిల్ క్లాస్ యువకుడిలా కనిపించాడు. ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి పల్లెటూరికి వచ్చి.. ఆ ఊరి సమస్యలు తీరుస్తున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. దీని బట్టి చూస్తే ఈ సీన్స్ అచ్చం శ్రీమంతుడు, మహర్షి వంటి సినిమాలలోని కొన్ని సన్నివేశాల మాదిరి ఉన్నట్లు కనిపిస్తోంది. అలా కాస్త యాక్షన్, ఎమోషన్, లవ్ వంటి కాన్సెప్టుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈ నెల అంటే జూలై 26న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×