BigTV English

Allu Arjun : నష్టాల్లో కూరుకుపోయిన దిల్ రాజును కాపాడిన బన్నీ… అదే జరగకపోయి ఉంటే…

Allu Arjun : నష్టాల్లో కూరుకుపోయిన దిల్ రాజును కాపాడిన బన్నీ… అదే జరగకపోయి ఉంటే…

Allu Arjun : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజ్ ఒకరు. ఆటోమొబైల్ బిజినెస్ మొదలుపెట్టి, ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్ గా తెలుగు సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేశారు. అయితే డిస్ట్రిబ్యూటర్ గా ఎన్నో ఎత్తి పల్లాలు చూసారు దిల్ రాజు. అందుకోసమే దిల్ రాజు ఎప్పుడు ఒక మాట చెప్తారు. సక్సెస్, ఫెయిల్యూర్, డబ్బు రావడం, డబ్బు పోవడం ఇక్కడ కామన్ థింగ్ కానీ మనం నిలబడటమే మనకు ఇంపార్టెంట్. ఇలా ఎన్నో హాట్పాట్లు వచ్చినా కూడా నిలబడ్డారు దిల్ రాజు. ఇక దిల్ సినిమాతో నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. ఇకపోతే దిల్ రాజు కెరియర్ లో చాలామంది కొత్త దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన దిల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది ఇంకొన్ని సినిమాలు నిర్మించడానికి ఆ సినిమా ఒక ప్రోత్సాహం ఇచ్చింది.


ఇక ఈ బ్యానర్ కొత్తలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, పరుగు అంటే ఎన్నో సినిమాలు ఈ బ్యానర్ లో వచ్చాయి. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అని అంటే ఏమీ ఆలోచించకుండా థియేటర్ కి వెళ్లిపోతారని చెప్పొచ్చు. ఇక ఒకవైపు నిర్మాతగా సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్న తరుణంలో మరోవైపు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు దిల్ రాజు. ఇక తేజ దర్శకత్వంలో నవదీప్ నటించిన జై అనే సినిమాను అప్పట్లో డిస్ట్రిబ్యూట్ చేశారు రాజు. అయితే ఆ సినిమా అప్పట్లోనే దాదాపు రెండు కోట్లు నష్టాన్ని తీసుకువచ్చింది. అదే టైంలో ఆర్య సినిమా హిట్ అవడంతో దిల్ రాజ్ సేఫ్ జోన్ లోకి వచ్చేసారు. అలా నష్టాల్లో వెళ్లిపోయిన దిల్ రాజుని ఆర్య సినిమా కాపాడింది. ఆ రోజుల్లో రెండు కోట్ల అంటే మామూలు చిన్న అమౌంట్ కాదు. ఆ టైంలో ఆర్య సినిమా పడకపోయి ఉంటే దిల్ రాజు ఇబ్బందుల్లో పడిపోయేవాళ్ళు. ఇక ఆర్య సినిమా చూపించిన ఇంపాక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ను స్టార్ హీరో చేసేసింది ఆ సినిమా.

ఇకపోతే ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో మొత్తానికి 50 సినిమాలు పైగా పూర్తి చేశారు. ఈ బ్యానర్ కు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. అలానే ఇండస్ట్రీలో దిల్ రాజు జడ్జ్మెంట్ కి కూడా ఒక వ్యాల్యూ ఉంటుందని మంచి టాక్ కూడా వచ్చింది. అందుకనే ప్రతి సినిమా పర్ఫెక్ట్ గా జడ్జి చేసి బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల చేస్తారు అని చాలామంది చెబుతూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి అనుసంధానంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ అని మరో కొత్త బ్యానర్ను క్రియేట్ చేసి ఆ బ్యానర్ లో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. బలగం సినిమాతో మొదలైన ఆ బ్యానర్ ప్రస్తుతం మూడవ సినిమా కూడా చేసే స్థాయికి వచ్చేసింది. బలగం సినిమా చూపించిన ఇంపాక్ట్ తక్కువేమీ కాదు. వేణు కు కూడా దర్శకుడుగా మంచి పేరును తీసుకొచ్చింది బలగం.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×