E-Paper
Advertisement

Salaar Movie : సలార్ ఫస్ట్ టికెట్ అందుకున్న దర్శక ధీరుడు .. హైప్ మాములుగా లేదుగా..

Salaar Movie : సలార్ ఫస్ట్ టికెట్ అందుకున్న దర్శక ధీరుడు .. హైప్ మాములుగా లేదుగా..
Advertisement
Salaar Movie latest news

Salaar Movie latest news(Telugu cinema news):

డిసెంబర్ ఎండింగ్ వస్తోంది అంటే సలార్ ఫీవర్ మొదలైంది అని లెక్క .ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే హాట్ డిస్కషన్ జరుగుతోంది .డిసెంబర్ 22న గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, ఫస్ట్ సింగిల్ బాగా ఆకట్టుకొని మూవీపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

ఈ మూవీలో ఎమోషనల్ కంటెంట్ తోపాటు ఫ్రెండ్షిప్, అలాగే భీకరమైన మాస్ యాక్షన్స్ సీన్స్ దండిగా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమయిపోతోంది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్న డీప్ ఫ్రెండ్షిప్ ని సింబలైజ్ చేస్తూ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ అందరినీ ఎమోషనల్ గా టచ్ చేసింది. సూరీడే.. అంటూ సాగే ఈ పాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా ఉంది.ఇక డిసెంబర్ 22న థియేటర్స్ లో విడుదల అయ్యేది సలార్ పార్ట్ 1. ఇది మొత్తానికి ఇద్దరు మిత్రుల స్టోరీగా ఉండబోతోందని అని క్లియర్ గా తెలుస్తోంది.

Advertisement

తన మిత్రుని రాజుగా చేయడం కోసం ఒక ఫ్రెండ్ సైన్యం సర్వం తానే అయి యుద్ధం జరుపుతాడు. అతని ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డువేసి ఎదురుగా వస్తున్న వందల మంది విలన్స్ తో ఒంటి చేత్తో పోరాడతాడు. తన ఫ్రెండ్ ను కాపాడుకోవడం కోసం ఎలాంటి యుద్ధానికి అయినా సిద్ధం.. అనే విషయాన్ని ఈ కథలో బాగా హైలైట్ చేయబోతున్నారు. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ ని జక్కన్న ఇంటర్వ్యూ చేసిన స్పెషల్ వీడియో కూడా షూట్ చేశారంట. ఇక త్వరలోనే ఈ వీడియోని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా ఈ వీడియో నిడివి గంటన్నర వరకు ఉంటుందంట. ఈ వీడియోలో సలార్ మూవీ విశేషాలు గురించి రాజమౌళి ప్రభాస్ అండ్ టీం ను అడిగినట్లు సమాచారం. అంతేకాకుండా ఇంటర్వ్యూ సమయంలో సలార్ కి సంబంధించిన ఫస్ట్ టికెట్ ను రాజమౌళి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో సోమవారం విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా మొత్తానికి సలార్ ఫస్ట్ టికెట్ అఫీషియల్ గా కొన్న వ్యక్తి రాజమౌళి కావడం మూవీకి మంచి హైప్ ఇస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×