E-Paper
Advertisement

Rajamouli SSMB 29 : మ‌హేష్ సినిమా గురించి రాజమౌళి అప్‌డేట్‌

Rajamouli SSMB 29 : మ‌హేష్ సినిమా గురించి రాజమౌళి అప్‌డేట్‌
Advertisement

Rajamouli SSMB 29 : సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌తో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఓ సినిమా చేయ‌నున్న‌సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం మ‌హేష్ అభిమానుల‌తో పాటు ఎంటైర్ సినీ జ‌నాలు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. జ‌క్క‌న్న‌తో సినిమా అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. లార్జ‌ర్ దేన్ లైఫ్ సినిమాల‌ను రూపొందించ‌టం ఆయ‌న స్పెషాలిటీ. ఇప్పుడు రాజమౌళి RRR సినిమాను ఆస్కార్ రేసులో నిలపటానికి అంత‌ర్జాతీయ వేదిక‌లపై ప్ర‌మోట్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో రాజ‌మౌళి త‌న నెక్ట్స్ మూవీ SSMB29 గురించి ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ ఇచ్చారు. ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తాను త‌దుప‌రి చిత్రాన్ని మ‌హేష్‌తో చేస్తున్నాన‌ని, ఇండియా జోన్స్ స్టైల్‌లో అదొక అడ్వెంచ‌ర‌స్ మూవీ అని రాజ‌మౌళి అన్నారు. తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌తో క‌లిసి ఇప్పుడే క‌థ‌ను తయారు చేసే పనిలో ఉన్నామ‌ని కూడా జ‌క్క‌న్న అన్నారు. ఇండియా జోన్స్ మూవీ తనకెంతో ఇష్టమైన సినిమా అని, అలాంటి సినిమా చేయాలని తనకెప్పటి నుంచో కోరిక ఉందని.. కాబట్టే ఇప్పుడలాంటి కథతో సినిమా చేస్తున్నా అన్నారు. మ‌హేష్‌తో రాజ‌మౌళి యాక్ష‌న్ మూవీ అంటే నెక్స్ రేంజ్‌లో ఉంటుంద‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు. వ‌చ్చే ఏడాదిలో మ‌హేష్ – రాజ‌మౌళి మూవీ ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం మ‌హేష్ త‌న 28వ సినిమాను త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×