E-Paper
Advertisement

Waltair Veerayya Song : మెగా మాస్ సాంగ్‌.. డేట్ ఫిక్స్ చేసిన మేక‌ర్స్‌

Waltair Veerayya Song : మెగా మాస్ సాంగ్‌.. డేట్ ఫిక్స్ చేసిన మేక‌ర్స్‌
Advertisement

Waltair Veerayya Song : మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. డైరెక్ట‌ర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రానున్న సంక్రాంతికి మూవీ థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌టానికి సర్వం సిద్ధ‌మవుతోంది. ఇప్ప‌టికే రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మాస్ బీట్‌ను విడుద‌ల చేయ‌టానికి రంగం సిద్ధ‌మైంది. న‌వంబ‌ర్ 23.. సాయంత్రం ఐదు గంట‌ల‌కు ‘వాల్తేరు వీరయ్య’ నుంచి తొలి సాంగ్ రిలీజ్ కానుంది. అది కూడా అభిమానులు మెచ్చేలా మాస్ బీట్ సాంగ్‌. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్.. రెండు రోజుల్లో విడుద‌ల‌కానున్న సాంగ్‌లో చిరంజీవి డాన్సుల‌తో అద‌ర‌గొట్టార‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.

చిరంజీవిపై రీసెంట్‌గానే మాస్ సాంగ్‌ను చిత్రీక‌రించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ పాట‌నే విడుద‌ల చేస్తున్నారు. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించారు. తన‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. శ్రుతీ హాస‌న్ ఇందులో హీరోయిన్‌. చిరంజీవి అన్న‌య్య‌గా.. అత‌ని త‌మ్ముడు పాత్ర‌లో ర‌వితేజ క‌నిపించ‌నున్నారు. మెగాస్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందించారు డైరెక్ట‌ర్ బాబీ. మరి ఈ చిత్రంతో అభిమానులను చిరంజీవి ఎలా మెప్పిస్తారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×