IND VS NZ Final : టీ-20 వరల్డ్ కప్ టోర్నీలో తొలి సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసి న్యూజిలాండ్ జట్టు ఫైనల్ కి వెళ్లింది. అలాగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య హోరా హోరీగా సాగింది. చివరికీ 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా జట్లు ఈనెల 08వ తేదీన అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా పై నెగిటివ్ వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : IND VS NZ Final: అభిషేక్ బతికిపోయాడు, మిస్టరీ స్పిన్నర్ పై వేటు..ఫైనల్స్ ఆడే టీమిండియా జట్టు ఇదే
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కి టీమిండియా కి మూడు గండాలు ఉండటం విశేషం. అందులో మొదటిది రిచర్డ్ కెటిల్ బరో (Richard Kettleborough) అంఫైర్. ఇతను టీమిండియా కి అన్ని నెగిటివ్ డిసెషన్స్ ఇవ్వడం గమనార్హం. రేపు జరుగబోయే ఫైనల్ మ్యాచ్ కి ఇతనే అంఫైర్. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం రెండో గండం. ఇక్కడ 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయాం. ఆస్ట్రేలియా జట్టు టైటిల్ ని ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఎగురేసుకుపోయింది. ఈ సారి కూడా న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా టీ 20 ఫైనల్ మ్యాచ్ ఇదే స్టేడియం కావడం విశేషం. ఇక మూడో గండం ఏమిటంటే..? న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన ఐసీసీ టోర్నమెంట్ లో టీమిండియా గెలవదు. పాత రికార్డులు అన్ని అలాగే ఉన్నాయి. గత టీ-20 వరల్డ్ కప్ లో 3 మ్యాచ్ ల్లో కూడా న్యూజిలాండ్ పై ఇండియా ఓటమి పాలైంది.
దీంతో 2026 టీ-20 వరల్డ్ కప్ న్యూజిలాండ్ దే అని సోషల్ మీడియా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి 2024 టీ-20 వరల్డ్ కప్ లో సెమీస్ కూడా చేరలేదు న్యూజిలాండ్ జట్టు. అంతకు ముందు 2022 టీ-20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో ఓటమి పాలైంది. 2021 టీ-20 వరల్డ్ కప్ తరువాత మళ్లీ ఐదేళ్లకు ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. ఐసీసీ టోర్నోలో న్యూజిలాండ్ టీమ్ ఫైనల్ కి చేరడం ఇది ఎనిమిదో సారి. భారత్ ఇప్పటికే 15 సార్లు ఐసీసీ ఫైనల్స్ ఆడి టాప్ లో ఉంది. ఇక ఆస్ట్రేలియా జట్టు 14 సార్లు ఐసీసీ ఫైనల్స్ ఆడింది. ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టు ఫైనల్ కి చేరడంతో టీమిండియా ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. ఇప్పటివరకు టీమిండియా జట్టు.. న్యూజిలాండ్ పై ఒక్క టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్ గెలవకపోవడం గమనార్హం. టీ-20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు మూడు సార్లు న్యూజిలాండ్ తో తలపడగా.. మూడు మ్యాచ్ ల్లోనూ ఓటమి పాలైంది. దీంతో ఆదివారం జరుగబోయే ఫైనల్ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. న్యూజిలాండ్ జట్టు పై టీమిండియా విజయం సాధించి రికార్డు క్రియేట్ చేస్తుందో.. లేక న్యూజిలాండ్ పై ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టుగా టీమిండియా నిలుస్తుందో వేచి చూడాలి మరీ.
Also Read : Inzamam ul haq: బుమ్రా బాల్ టాంపరింగ్ చేశాడు, అతన్ని బ్యాన్ చేయండి !