BigTV English

Rajinikanth : ఇదేందయ్యా ఇది..గుడి కట్టి పూజలు కూడా.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..

Rajinikanth : ఇదేందయ్యా ఇది..గుడి కట్టి పూజలు కూడా.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..

Rajinikanth : సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు అభిమానులు ఉంటారు. తమ హీరో సినిమా వస్తుంటే వారి హంగామా ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆ సినిమా హిట్ అయిన, ప్లాప్ అయిన కూడా అభిమానం ఎక్కడా తగ్గదు.. హీరోల బర్త్ డే లు వస్తున్నాయంటే చాలు ఎంతగా హంగామా చేస్తారో చూస్తూనే ఉంటాము. ఇక అంతకు మించి అభిమానం ఉంటే వాళ్ళకు హీరోలు దేవుళ్ళు అవుతారు. డైహార్డ్ ఫ్యాన్ అవ్వడంతో పాటుగా గుడి కట్టిస్తారు.. అదేం పిచ్చి రా బాబు అని అనుకుంటున్నారు కదా.. అవును అండి మీరు విన్నది అక్షరాలా నిజం.. ఓ వ్యక్తి తన ఫేవరెట్ కు ఇంట్లోనే గుడి కట్టించాడు. అంతేకాదు ఆ విగ్రహానికి ఏకంగా అభిషేకాలు చేస్తూ, హారతులు కూడా ఇస్తున్నాడు. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


తమిళనాట కొలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరోకు కూడా లేదు. మన దేశంతో పాటుగా వేరే దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందులో మధురై జిల్లా తిరుమంగళానికి చెందిన కార్తీక్ కూడా ఒకరు. భారదేశ సైనికుడుగా సేవలను అందించిన ఈయన రిటైర్డ్ అయ్యారు. ఆయనకు రజినీకాంత్ అంటే పిచ్చి.. ఎంత అభిమానం అంటే దాన్ని గుండెల్లో దాచుకోలేక గుడి కట్టించారు. తన ఇంట్లోనూ గుడి కట్టేశాడు. అంతేకా కుండా రజనీ విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆ వీడియోలు కాస్త రజినీకాంత్ వరకు చేరాయి. ఆ వీడియోను చూసిన తలైవా ఆనందంతో ఉప్పొంగిపోయాడు.

కార్తీక్‌ అతని కుటుంబ సభ్యులను చెన్నై, పోయస్‌ గార్డెన్లోని తన ఇంటికి రప్పించారు. తన అభిమానిని ప్రత్యేకంగా అభినందించారు.. తన ఇంటిని చూపించి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలను దిగారు. ఆ ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రజినీ సినిమాల విషయానికొస్తే.. గతేడాది లాల్ సలామ్, వెట్టయ్యాన్ లతో ఆడియెన్స్ ను పలకరించారు రజనీకాంత్. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే చేస్తున్నారు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, షోబిన్ సాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబ్బా మోనికా జాన్ నటించనున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారని టాక్.. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలే రజినీ కాంత్ చిన్న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది.


Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×