Champions Trophy 2025: తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పై పడింది. ఈ ట్రోఫీ ఫిబ్రవరి 19వ తేదీ నుండి హైబ్రిడ్ మోడల్ లో జరగనుంది. పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ {Champions Trophy 2025} జరగనుండగా.. భారత జట్టు ఆడే మ్యాచ్ లను దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఇప్పటివరకు దాదాపు అన్ని జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే స్క్వాడ్ లను ప్రకటించేశాయి.
Also Read: Champions Trophy 2025: వైస్ కెప్టెన్ గా బుమ్రా.. మరి రోహిత్ పరిస్థితి?
కానీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాత్రం ఇప్పటివరకు జట్టును ప్రకటించలేదు. జట్టును ప్రకటించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జనవరి 12వ తేదీ వరకు గడువు ఇచ్చింది. దీంతో బీసీసీఐ భారత జట్టును జనవరి 12వ తేదీన ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ {Champions Trophy 2025} తుది జట్టులో ఎవరెవరు స్థానం సంపాదిస్తారు..? ఎవరెవరికి నిరాశ ఎదురవుతుంది..? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఈ {Champions Trophy 2025} మెగా టోర్నీ కి భారత కెప్టెన్ గా రోహిత్ శర్మని నియమించనున్నట్లు పలు రిపోర్ట్ లు పేర్కొంటున్నాయి. ఇక వైస్ కెప్టెన్ గా పేస్ బౌలర్ బుమ్రా ని నియమించాలని బీసీసీఐ యోచిస్తోంది. అలాగే కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న మొహమ్మద్ షమీ ఈ ఛాంపియర్స్ ట్రోఫీ ఆడేందుకు ఎంపిక అవుతారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన షమీ.. పూర్తి ఫిట్నెస్ సాధిస్తే చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కానున్నాడు.
మరోవైపు దేశవాలి క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ కూడా {Champions Trophy 2025} భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే తటస్థ వేదిక అయిన దుబాయ్ పిచ్ లు స్పిన్ కి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈసారి భారత జట్టులో స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. భారత పేస్ విభాగాన్ని అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ ల సాయంతో బుమ్రా నడిపించనున్నాడు. ఇక స్పిన్ విభాగాన్ని రవీంద్ర జడేజా, అక్షర పటేల్, వాషింగ్టన్ సుందర్ లేదా కుల్దీప్ యాదవ్ నడిపిస్తారు.
Also Read: Dhanashree Verma: పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాడు.. ధనశ్రీ ఫోటోలు వైరల్ ?
అయితే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ కి మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ {Champions Trophy 2025} లో చోటు దక్కడం లేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సంజు ఎంపిక కాకపోవడానికి ప్రధాన కారణం అతడు విజయ్ హజారే ట్రోఫీలో ఆడకపోవడమేనట. విజయ్ హజారే ట్రోఫీ కోసం టోర్నీ ప్రారంభానికి ముందు వయోనాడ్ లో జరిగిన మూడు రోజుల శిక్షణ శిబిరానికి శాంసన్ హాజరు కాలేదు. దీంతో అతడిని జట్టులోకి తీసుకోకూడదని బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలోనే అతడు ఛాంపియన్స్ ట్రోపీకి కూడా ఎంపిక కావడం కావడం లేదని సమాచారం.