E-Paper
Advertisement

Vettaiyan Digital Rights: తలైవా కొత్త సినిమా డిజిటల్ రైట్స్.. ఆ ఓటీటీకే సొంతం..?

Vettaiyan Digital Rights: తలైవా కొత్త సినిమా డిజిటల్ రైట్స్.. ఆ ఓటీటీకే సొంతం..?
Advertisement

Rajinikanth’s Vettaiyan Digital Rights: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఫుల్ జోష్‌ మీద ఉన్నాడు. యంగ్ హీరోలతో సమానంగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ రజనీ కెరీర్‌ని మళ్లీ మలుపు తిప్పింది. ఎందుకంటే ఈ మూవీకి ముందు రజనీ చేసినవన్నీ బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. అదే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ మాత్రం ఊహించని హిట్ అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది.

దీని తర్వాత రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ సలాం’ మూవీలో కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా మాత్రం సినీ ప్రియుల్ని, అభిమానుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో ప్రధాన పాత్రలు వేరే నటులు చేసినా.. కీలక పాత్రలో రజనీకాంత్ నటించడంతో అందరూ థియేటర్లకు పరుగులు తీశారు. కానీ సినిమాలో సరైన కంటెంట్ లేకపోవడంతో సినీ ప్రేక్షకులు దీనిని రిజెక్ట్ చేశారు.

Advertisement

అయితే ఇప్పుడు రజనీ లైనప్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ‘జై భీమ్’ ఫేం టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ తెలుగులో ‘వేటగాడు’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం రజనీ కెరీర్‌లో 170వ మూవీగా రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి.

Also Read: ఇద్దరు స్టార్లు కలిసారు భయ్యా.. ఇక బాక్సాఫీసు బద్దలే..!

Advertisement

ఏది ఏమైనా సూపర్ స్టార్ మూవీ అంటే హైప్ అమాంతంగా పెరిగిపోతుంది. అదీకాక దర్శకుడు కూడా మంచి ఫామ్‌లో ఉండటంతో సినిమాపై అంచనాలు అలా అలా పెరిగిపోయాయి. ఇక ఈ హైప్ చూసి ప్రముఖ ఓటీటీ సంస్థలు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుక్కునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ న్యూస్ బయటకొచ్చి వైరల్‌గా మారింది. ‘వెట్టయాన్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను అధిక ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. కాగా ఈ మూవీలో భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్ సహా మరికొంతమంది నటీ, నటులు ఇందులో భాగం అయ్యారు. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే అన్నిపనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ కానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×