BigTV English

Rajinikanth – Amithab Combo: ఇద్దరు స్టార్లు కలిసారు భయ్యా.. ఇక బాక్సాఫీసు బద్దలే..!

Rajinikanth – Amithab Combo: ఇద్దరు స్టార్లు కలిసారు భయ్యా.. ఇక బాక్సాఫీసు బద్దలే..!

Amithab Bacchan Joins in Rajinikanth’s Vettaiyan Movies Sets: సూపర్ స్టార్ రజినీకాంత్ గతేడాది ‘జైలర్’ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీకి ముందు వరకు తీసిన సినిమాలన్నీ ఫ్లాపులుగా మిగిలాయి. అయితే ‘జైలర్’ మాత్రం రజినీ కెరీర్‌కు మంచి స్టార్డమ్‌ అందించింది. దీంతో రజినీ మళ్లీ జోరుందుకున్నాడు. ఈ తరుణంలో కుర్ర హీరోలకు సమనంగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.


ఇందులో భాగంగానే అతడి లైనప్‌లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో ‘వెట్టయాన్’ ఒకటి. ఈ మూవీ తెలుగులో ‘వేటగాడు’ టైటిల్‌తో రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు ‘జై భీమ్’ ఫేం టీ.జే జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని భారీ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

దాదాపు 75 శాతం వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం ఇందులో స్టార్ నటీ నటులు నటిస్తుండటమే. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఊపందుకున్నాయి.


Also Read: ‘కూలీ’ కోసం రజినీ భారీ రెమ్యూనరేషన్‌.. మరో ‘బాహుబలి 2’ తీయొచ్చు!

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కొన్ని షెడ్యూళ్లని తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న మూవీ యూనిట్.. తాజాగా ముంబైకి షిఫ్ట్ అయింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా లాస్ట్ పార్ట్‌ను ముంబైలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అందుకు సంబంధించి ఓ అప్డేట్‌ను మేకర్స్ పంచుకున్నారు. ముంబైలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ జాయిన్ అయినట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెలిపింది.

ఈ మేరకు సెట్స్ నుంచి రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇక ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే చోట స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇకపోతే ఈ మూవీలో రితికా సింగ్ వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ యంగ్ అండ్ స్టైలిష్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి దరువు అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Also Read: Indian 2: కమల్ హాసన్‌ ఫ్యాన్స్‌కు మళ్లీ షాక్.. ఇండియన్ 2 వాయిదా?.. పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×