BigTV English

AP Cabinet Formation: అందరి చూపు ఏపీ వైపు.. మంత్రివర్గ కూర్పులో ఎవరికెన్ని..?

AP Cabinet Formation: అందరి చూపు ఏపీ వైపు.. మంత్రివర్గ కూర్పులో ఎవరికెన్ని..?

AP Cabinet Ministers Formation: రేపే ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు అందరి చూపు ఏపీపైనే ఉంది. మంత్రివర్గంలో చంద్రబాబు ఎవరెవరికి ప్రాధాన్యమిస్తారు. పొత్తులో భాగంగా ఉన్న జనసేన, బీజేపీలకు ఎన్ని మంత్రి సీట్లు కేటాయిస్తారు ? పవన్ కు ఏయే శాఖలు ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు.. టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన సీనియర్లు, జూనియర్లకు కూడా మంత్రివర్గ కూర్పులో న్యాయం చేయాలి. ఇదంతా చేయడం అనుకున్నంత ఈజీ కాదు. కానీ.. అందరితో మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానమివ్వాలో ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రానికల్లా మంత్రివర్గ కూర్పుపై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తోంది.


జనసేన అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం, హోం శాఖలను ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈసారి కేబినెట్ లో పవన్ ఒక్కడికే డిప్యూటీ సీఎం ఇవ్వనున్నట్లు దాదాపు స్పష్టమైంది. పవన్ తో కలిపి జనసేనకు 3 మంత్రి పదవులు, బీజేపీకి ఒకేఒక్క మంత్రి పదవి ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు మోదీ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారా అన్న సందేహం మొదలైంది. ఏపీలో కూటమి అభ్యర్థులు 25 స్థానాలకు గాను 21 స్థానాల్లో విజయం సాధించారు. వీటిలో జనసేన 2 స్థానాల్లో పోటీ చేసి రెండింటా విజయాన్ని అందుకుంది. బీజేపీ 3 స్థానాల్లో గెలిచింది. మిగతా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.

8 ఎంపీలకు ఒక మంత్రి పదవి చొప్పున.. ఏపీకి 3 మంత్రి పదవులు ఇచ్చారు మోదీ. అదే స్ట్రాటజీని చంద్రబాబు ఫాలో అయితే.. జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రిపదవే ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. బీజేపీకి ఇచ్చే ఆ ఒక్క శాఖ దేవాదాయ శాఖేనని సమాచారం. అయితే ఈ పదవి తమకొద్దంటే వద్దంటున్నారట బీజేపీ ఎమ్మెల్యేలు. మరి పవన్ మినహా.. మిగిలిన ముగ్గురికి ఏయే శాఖలు కేటాయిస్తారన్న విషయం ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది.


Also Read: ఎల్లుండే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని భావించిన చంద్రబాబు.. ఫలితాలకు ముందే.. మంత్రివర్గంపై కసరత్తు చేశారని తెలుస్తోంది. 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవడంతో.. మంత్రి పదవులను ఆశించేవారి సంఖ్య అధికంగా ఉందనే చెప్పాలి. ఎవరికి వారే తమకు మంత్రి పదవి ఇచ్చే అర్హత ఉందన్న భావనలో ఉన్నారు. మంత్రి పదవిపై మాట్లాడేందుకు గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబును పర్సనల్ కలిసే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇతరుల సమక్షంలోనే మాట్లాడటంతో.. తమ మనసులో మాట చెప్పుకునే అవకాశం రాలేదు. మరి చంద్రబాబు ఎవరెవరికి ఏయే శాఖలిస్తారో చూడాలి.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×