BigTV English

Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ పెళ్లి.. ఎప్పుడు.. ఎక్కడంటే..?

Rakul Preet Singh: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ పెళ్లి.. ఎప్పుడు.. ఎక్కడంటే..?

Rakul Preet Singh: 2023 ఏడాదిలో చాలా మంది సినీ సెలబ్రెటీలు ప్రేమించి పెళ్లిచేసుకొని సెటిల్ అయ్యారు. అందులో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి.. మంచు మనోజ్-మౌనిక రెడ్డి, శర్వానంద్-రక్షిత రెడ్డి, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, దగ్గుబాటి అభిరామ్-ప్రత్యూష వంటి సెలబ్రెటీలు ఉన్నారు.


అలా ఇప్పుడు టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరోయిన్ కూడా మ్యారేజ్‌‌కి రెడీ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ అండ్ డే‌ట్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు.. రకుల్ ప్రీత్ సింగ్. డిల్లీకి చెందిన ఈ బ్యూటీ.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది. ఆపై మరిన్ని సినిమాలు చేసి.. స్టార్ హీరోల సరసర నటించే ఛాన్స్ అందుకుంది. ఇక చివరిగా మన్మధుడు-2 సినిమాలో నటించి దక్షిణాది పరిశ్రమకు దూరమయి.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా రెండు మూడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకుంది. ప్రస్తుతం హిందీలో ఒకటో రెండో సినిమాలు చేస్తోంది.

ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌కి చెందిన హీరో కమ్ నిర్మాత జాకీ భగ్నానీతో గాఢ ప్రేమలో ఉంది. గత మూడేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.


తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 22న గోవాలో రకుల్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగబోతోందని టాక్. త్వరలోనే తమ పెళ్లి డేట్ ను అఫీషియల్ గా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత? అనే విషయంపై త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×