BigTV English
Advertisement

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

Ram Charan.. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). భారీ అంచనాల మధ్య డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం పక్కా ప్లానింగ్ చేస్తోంది. ఇప్పటికే రూ.350 కోట్లు ఈ చిత్రానికి కేటాయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఈ సినిమా రామ్ చరణ్ కు తీసుకువచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


స్టార్ ఫిక్స్ మ్యాగజైన్ కవర్ పై మెరిసిన రామ్ చరణ్..

రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు..అయితే ఇప్పుడు ఈయనకు మరొకసారి హాలీవుడ్ లో అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్ కి చెందిన ప్రముఖ మ్యాగజైన్ స్టార్ ఫిక్స్ కవర్ పేజ్ పైన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోటో హాలీవుడ్ ప్రముఖులతో పాటు ప్రచురించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే రామ్ చరణ్ కు ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ ఊహించని ఇమేజ్ ను అందించిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై చోటు దక్కించుకోవడం నిజంగా ప్రశంసనీయం అనడంలో సందేహం లేదు. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు , అభిమానులు రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది కదా గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే అంటూ అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.


Ram Charan : A rare honor in Hollywood... This is what a global star means..
Ram Charan : A rare honor in Hollywood… This is what a global star means..

రామ్ చరణ్ సినిమాలు..

రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతుండగా, ఇందులో కియారా అద్వానీ మరొకసారి ఈయనతో జోడి కట్టబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన సినిమాతో సెన్సేషన్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తన 16వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికయింది. ప్రస్తుతం జాన్వీ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఈ సినిమా విడుదల కాకముందే ఈమె రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా గడిచిన కొన్ని నెల క్రితం పూర్తి అయ్యాయి.. త్వరలోనే ఈ సినిమా సెట్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా నవంబర్లో షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరి ఈ సినిమాలు రాంచరణ్ కు ఎటువంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×