BigTV English

Jani Master Case : తప్పు చేసింది జానీ… ఎఫెక్ట్ అవుతుంది మెగా ఫ్యామిలీ – రీజన్స్ ఇవేనా..?

Jani Master Case : తప్పు చేసింది జానీ… ఎఫెక్ట్ అవుతుంది మెగా ఫ్యామిలీ – రీజన్స్ ఇవేనా..?

Jani Master Case : జానీ మాస్టర్ చేసింది తప్పే. ఒక యువతి బయటికి వచ్చి తనకు ఇలా జరిగింది అంటే అందరూ స్పందించాల్సిందే. ఆ యువతికి అండగా నిలవాల్సిందే. నిజానికి అది ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతుంది. కానీ, ఇదే టైంలో మరోకటి జరుగుతుంది. కొంత మంది ఈ విషయాన్నిను తప్పుదారి పట్టిస్తున్నారు. తప్పు చేసింది జానీ మాస్టర్ అయితే, దాన్ని మెగా ఫ్యామిలీ వైపు, పవన్ కళ్యాణ్ వైపు మళ్లించేలా చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ దీనిలో ముందు ఉన్నాడు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బన్నీ సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడని, అందులో భాగంగానే మెగా ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చాడని, ఈ క్రమంలో వారి మధ్య తీవ్రమైన గొడవలు అవుతున్నాయని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జానీ కేసుతో మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.


ఇది ఇప్పటిది కాదు బ్రదర్…

చెప్పను బ్రదర్… ఈ డైలాగ్ అల్లు అర్జున్ నుంచి వచ్చిన నాటి నుంచి మెగా ఫ్యాన్స్ ఆయనను ఓన్ చేసుకోలేకపోతున్నారు. దీని తర్వాత జరిగిన పరిణామాల వల్ల అల్లు అర్జున్ ను పట్టించుకోవడం మానేశారు. రీసెంట్ జరిగిన ఎన్నికల్లో బన్నీ.. వైసీపీ కి సపొర్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ కి బన్నీ ఓ విలన్ అయిపోయాడు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, బన్నీ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ ఆర్మీ అంటూ మెగా హీరోలను ట్రోల్స్ చేయడమే పని పెట్టుకున్నారు.


తప్పు చేసింది జానీ… నెగిటివ్ అవుతుంది మెగా ఫ్యామిలీ…

తనపై లైంగిక వేధింపులు చేశాడని జానీ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సినిమాలోకం అందరూ రెస్పాండ్ అవ్వాల్సిందే. అవుతున్నారు కూడా… జానీ మాస్టర్ పై చర్యలు తీసుకోవడం కూడా స్టార్ట్ అయింది. ముందుగా జనసేన పార్టీ జానీపై తీవ్రంగా స్పందించి.. ఏకంగా పార్టీ నుంచే సస్పెండ్ చేసింది. తర్వాత జానీపై ఫిల్మ్ ఛాంబర్ రియాక్ట్ అయింది. డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడింట్ నుంచి తప్పించారు. ఇలా జానీపై చర్యలు జరుగుతున్నాయి.

కానీ, ఈ గ్యాప్ లో మెగా హీరోలు రెస్పాండ్ అవ్వడం లేదు అంటూ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వలేదని, చిరంజవి సైలెంట్ గా ఉన్నాడని, యూట్యూబర్ ప్రణీత్ విషయంలో సాయి ధరమ్ తేజ్ చాలా స్పీడ్ రియాక్ట్ అయ్యారు.. ఇప్పుడు ఈ విషయంలో నోరు మొదపడం లేదు అంటూ నాన్ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ మాత్రమే కాదు…

ఈ ఇష్యూ విషయంలో మెగా ఫ్యామిలీని కార్నర్ చేస్తూ వస్తుంది కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. దీనికి కారణం… ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కి పొలిటికట్ టచ్ ఉంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న జనసేన పార్టీలో జానీ మాస్టర్ చాలా యాక్టివ్ గా ఉన్నాడు. అలాగే ఏపీలో జరిగిన గత ఎన్నికల్లోనూ జానీ మాస్టర్ ప్రచారం ఎక్కువగా చేశాడు. ఇదే టైంలో మెగా ఫ్యామిలీ కూడా జనసేన కి సపొర్ట్ చేసింది. అంతే కాదు, గత ప్రభుత్వంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో చిరంజీవి, జగన్ అవమానించారని కూడా స్ప్రెడ్ చేశారు. ఇది వైసీపీ ఓడిపోవడంలో సాయపడింది. దీంతో మెగా ఫ్యామిలీపై రీవెంజ్ తీసుకోవడానికి మంచి టైం కోసం ఎదురుచూస్తున్న వైసీపీ కార్యకర్తలకు ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఓ ఆస్త్రంలా మారింది.

ఇలా… తప్పు చేసింది జానీ మాస్టర్ అయినా, మెగా ఫ్యామిలీ విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఏది ఏమైనా… జానీ చేసిన దానికి మెగా ఫ్యామిలీ స్పందించాల్సిన అవసరం మాత్రం ఉందనే చెప్పాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×