E-Paper
Advertisement

Game Changer: సెన్సార్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్.. రన్ టైమ్ లాక్.!

Game Changer: సెన్సార్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్.. రన్ టైమ్ లాక్.!
Advertisement

Game Changer:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రముఖ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ (Game Changer). భారీ అంచనాల మధ్య జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈరోజు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక నిన్ననే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల అది వాయిదా పడుతూ.. ఈరోజు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరొకవైపు బాలకృష్ణ (Balakrishna) , బాబీ(Bobby) దర్శకత్వంలో చేస్తున్న సినిమా డాకు మహారాజ్ ,(Daaku Maharaj). ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చాలా గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు.కానీ గేమ్ ఛేంజర్ వల్ల అది వాయిదా పడింది. మరి గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈరోజైనా రిలీజ్ చేస్తారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్..

Advertisement

ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అందులో భాగంగానే సెన్సార్ నుండి ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ ను కూడా సొంతం చేసుకుంది.తాజాగా రన్ టైం కూడా లాక్ చేశారు సెన్సార్ బోర్డు అధికారులు. 2:45:30 నిడివి తో సినిమాని రన్ చేయబోతున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఇంత నిడివి ఉన్న సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రెండున్నర గంటల పాటు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టాలి అంటే, దర్శకుడు, హీరో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది 2:45 గంటలు అంటే కచ్చితంగా ఎంతో శ్రమించారు అని అర్థమవుతుంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ మౌత్ టాక్ అక్కడక్కడ వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంక్రాంతికి విడుదల..

Advertisement

ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara advani), రాంచరణ్ (Ram Charan) సరసన హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే అంజలి(Anjali) కూడా ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సమాచారం. మరోవైపు గ్లోబల్ రేంజ్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ తో శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయం అందరిలోనూ చాలా ఎక్సైజ్ మెంట్ ను పెంచుతోంది. అటు మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూవీ, టీజర్, 4 పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశమే అవధిగా అన్నట్లు పెరిగిపోయాయి. ఇక మొత్తానికి అయితే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలోకి దిగబోతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×