E-Paper
Advertisement

DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డీఆర్‌డీవోలో భారీగా ఉద్యోగాలు

DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డీఆర్‌డీవోలో భారీగా ఉద్యోగాలు
Advertisement

DRDO Recruitment 2024: నిరుద్యోగుల కోసం అనేక ప్రభుత్వ రంగ కంపెనీలు అప్రెంట్రిస్ షిప్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వీటి ద్వారా స్టైఫండ్ తో పాటు వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా పొందవచ్చు. తాజాగా ఐటీఐ పాస్ అయిన వారికి ప్రముఖ రక్షణ రంగ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేసేందుకు అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఐటీఐ పాస్ అయిన వారు అధికారిక వెబ్ సైట్ appenticeshipindia.gov.in లో మే 31 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్ మెంట్ ద్వారా టర్నర్, మెకానిక్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేస్తారు.

Advertisement

ఖాళీల వివరాలు: డిఫెన్స్ మెటలర్జికల్ లాబొరేటరీలో మొత్తం 127 ఐటీఐ అప్రెంట్రిస్ షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టర్నర్ 8, ఫిట్టర్ 20, వెల్డర్ 4, ఎలక్ట్రానిక్ 4, ఎలక్ట్రీషియన్ 12, మెషినిష్ట్ 16, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 60, బుక్ బైండర్ ఒక పోస్టు, కార్పెంటర్ 2, పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత: దరఖాస్తు దారులు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాస్ అయి ఉండాలి. SCIV,NCVT నుంచి ITI ఐటీఐ పాస్ అయిన రెగ్యులర్ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Advertisement

వయో పరిమితి: దరఖాస్తు చేసుకునే వారు 18 ఏళ్లు నిండి ఉండాలి. 55 ఏళ్ల లోపు వయస్సు వారై ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ముందుగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి DMRL, DRDO అప్రెంటిస్ షిప్ 2024 లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి. అప్లై నౌ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. అనంతరం వ్యక్తిగత వివరాల ద్వారా రిజిస్టర్ అవ్వాలి. తర్వాత రిజిస్టర్ అయిన ఐడీ సహాయంతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. అన్ని వివరాలతో అప్లికేషన్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి..సబ్ మిట్ చేయాలి.

Also Read: ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు.. పూర్తి వివరాలివే..

ఎంపిక ప్రక్రియ: పదవ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కులు ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×