Pawan Kalyan: తాను ఎంతో సంపాందించానని.. తనకి రాజకీయాలు అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు ఉన్నదంతా సమాజం పట్ల బాధ్యతేనని తెలిపారు. దేశం దాటడానికి కోర్టు అనుమతి తీసుకునే వ్యక్తి మనకి సీఎం అయ్యారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
2019లో తాను చెప్పిన మాటలను ఎవరూ వినలేదని.. అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని కాకినాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ అన్నారు. ‘నా దేశాన్ని, నా నెలను కాపాడుకోవాలనే వేదన నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నాకు రాజకీయాల్లోకి వచ్చి అందరితో తిట్లు తినాల్సిన అవసరం లేదు. నేను మీ కోసం వచ్చాను. నేను నాకోసం ఓటు వేయమని అడగట్లేదు, మీ భవిష్యత్తు కోసం ఓట్లు వేయమని అడుగుతున్నాను. ఆలోచించి ఓటు వేయండి’ అని ప్రజలను కోరారు.
‘కేవలం పదవి మాత్రమే కావలి అంటే ప్రధానితో నాకు ఉన్న సాన్నిహిత్యానికి ఏదో ఒక పదవి తీసుకునే వాడిని, కానీ నాకు పదవులు కాదు, మీ భవిష్యత్తు ముఖ్యం. నా ఒక్కడికి కోపం వస్తే సరిపోదు, మీ అందరికీ కోపం వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది, వైసీపీ ఓడుతుంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, ఈ ఎన్నికల్లో మీరు మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి, రాష్ట్రాన్ని కాపాడండి. భగత్ సింగ్ ను ఆరాధించే మనం, చేగువేరా ను అభిమానించే మనం, ఒక రౌడి ఎమ్మెల్యేకు భయపడతామా, భయం వదిలేయండి. గాంధీ, భగత్ సింగ్ లకు మాలలు వేసి, వైసీపీ లాంటి గూండా ప్రభుత్వానికి ఓటు వేస్తాం అంటే ఈ సమాజాన్ని మీరు చేజేతులా నాశనం చేసినట్లే, ఆలోచించి ఓటు వేయండి.
మనకు మారే వ్యక్తులు కాదు, స్థిరంగా నిలబడే వ్యక్తులు కావాలి, ఊసరవెల్లి లాంటి చలమలశెట్టి సునీల్ లాంటి వ్యక్తి మన కాకినాడ పార్లమెంట్ కు సరికాదు. క్రిమినల్స్ రాజ్యలేలితే మన కాకినాడ లా తయారవుతుంది, కాకినాడ నుండి క్రిమినల్స్ ను పంపించేద్దాం, ద్వారంపూడి లాంటి చెంచా గాళ్లను పంపించేద్దాం’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని మండిపడ్డారు.