BigTV English

Ram Charan Jaragandi Song: బెస్ట్ డ్యాన్సర్ ను పెట్టుకొని.. ఆ స్టెప్స్ ఏంటీ.. ఆ డ్యాన్స్ ఏంటీ.. ?

Ram Charan Jaragandi Song: బెస్ట్ డ్యాన్సర్ ను పెట్టుకొని.. ఆ స్టెప్స్ ఏంటీ.. ఆ డ్యాన్స్ ఏంటీ.. ?


Ram Charan Jaragandi Song (latest news in tollywood) : టాలీవుడ్ లోనే బెస్ట్ డ్యాన్సర్ల పేర్లు తీస్తే టాప్ 5 లో  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతలా చరణ్ డ్యాన్స్ తో మెస్మరైజ్ చేయగలడు. ఎన్నో సాంగ్స్ లో అతడి స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా కూడా అయ్యారు. అలాంటి బెస్ట్ డ్యాన్సర్ తో మాస్ సాంగ్ అంటే ఫ్యాన్స్ ఎలా ఊహించుకుంటారు.  అందులోనూ ఇండియా మైఖేల్ జాక్సన్ అని పేరు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్ ప్రభుదేవా స్టెప్స్ నేర్పిస్తే.. థియేటర్ ఊగిపోతోంది  అనుకున్నారు. కానీ, జరగండి సాంగ్ లో ఫ్యాన్స్ అనుకున్నది వేరు.. జరిగింది వేరు. ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఇక నేడు రామ్ చరణ్ బర్త్ డే కానుకగా .. ఈ చిత్రం నుంచి జరగండి జరగండి అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే.  చరణ్, కియారా ల మధ్య వచ్చే  ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే.. ఎంత మందికి నచ్చిందో.. అంతేముంది విమర్శిస్తున్నారు కూడా. దానికి కారణం ప్రభుదేవా కొరియోగ్రఫీ. రామ్ చరణ్, కియారా లాంటి డ్యాన్సర్స్ తో ఇలాంటి స్టెప్స్ వేయించడం ఏంటి అని మండిపడుతున్నారు.


హుక్ స్టెప్ గా ఈ సాంగ్ లో కియారా, చరణ్ ఎదురెదురుగా నిలబడి  తల మాత్రమే  రొటేట్ చేస్తూ కనిపించారు. అసలు ఇలాంటి స్టెప్ చరణ్  నుంచి కానీ, ప్రభుదేవా నుంచి కానీ ఊహించలేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అసలు ఇదేం స్టెప్ రా.. చరణ్ ఈ స్టెప్ వేయడానికి ఎలా ఒప్పుకున్నాడు అని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ హుక్ స్టెప్స్ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సాంగ్  థియేటర్ లో ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×