BigTV English

Miss Universe 2024: సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. మిస్ యూనివర్స్ పోటీల్లోకి ఎంట్రీ..

Miss Universe 2024: సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. మిస్ యూనివర్స్ పోటీల్లోకి ఎంట్రీ..
Rumy Alqahtani
Rumy Alqahtani

Miss Universe 2024: ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా ఏ సౌదీ దేశం కూడా తీసుకోని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. సౌదీకి చెందిన రూమీ అల్కహ్తాని అనే 27 ఏళ్ల అందాల భామ ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.


దేశ చరిత్రలో తొలిసారిగా సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రపంచ సుందరి పోటీల్లో సౌదీ అరేబియా నుంచి రూమీ అల్కహ్తాని పాల్గొంటున్నట్లు ఆమె స్వయంగా.. ఇన్ స్టాగ్రామ్ వేదిక ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. అంతర్జాతీయ వేదికపై జరిగే అందాల పోటీల్లో పాల్గొనే మొదటి సౌదీ యువతిగా ఆమె నిలవనుంది.

2024లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలు 73వ పోటీలు. ఈ పోటీలు 2024 సెప్టెంబర్ 28న మెక్సికోలో జరగనున్నాయి. ఈ పోటీల్లో సౌదీ అరేబియా భాగం కానుంది. రియాద్ కు చెందిన రూమీ అల్కహ్తాని ఈ పోటీల్లో పాల్లొంటారు. అయితే రూమీ ఇటీవలే మలేసియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏసియన్ ఈవెంటల్లో పాల్గొన్నారు.


ఈ పోటీల్లో పాల్గొన్న ఆమె.. సౌదీ సంప్రదాయాన్ని, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడంతో పాటుగా.. తానుకుడా ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని వెల్లడించారు. రూమీ గతంలో పలు అందాల పోటీల్లో కూడా పాల్గొన్నారు.

Also Read: World Happiness Report : డిప్రెషన్ లో యువత.. వెనుకబడిన అమెరికా.. ఎందుకిలా ?

గతంలో ఈమె మిస్ సౌదీ అరేబియా కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో పాటుగా మిస్ మిడిల్ ఈస్ట్, మిస్ అరబ్ వరల్డ్ పీస్ 2021, మిస్ వుమెన్ వంటి పలు అందల పోటీల్లో కిరీటాలను దక్కించుకున్నారు. ప్రస్తుతం తాను మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

Tags

Related News

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Big Stories

×