Big Stories

SBI Debit Card Charges Hike: SBI వినియోగదారులకు షాక్.. డెబిట్ కార్డు ఛార్జీలు పెంపు బ్యాంకు

- Advertisement -

SBI Increased Debit Cards Annual Maintenance Charges: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్ బీఐ తన వినియోగదారులకు షాకిచ్చింది. SBI డెబిట్ కార్డులపై యాన్యువల్ ఛార్జీలు పెంచింది. గరిష్ఠంగా రూ.75 పెంచింది. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. డెబిట్ కార్డుల వినియోగంపై ఏడాదికి వసూలు చేసే ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని SBI తన అధికారిక వెబ్ సైట్ లో చెప్పింది.

- Advertisement -

క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులకు ప్రస్తుతం రూ.125+GST వసూలు చేస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి ఈ ఛార్జీలు రూ.200+GST వసూలు చేయనుంది. అలాగే యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై ఇమేజ్ కార్డులపై మెయింటెనెన్స్ ఛార్జీలు రూ.175+GST వసూలు చేస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి రూ.250+GST వసూలు చేయనుంది. ప్లాటినం డెబిట్ కార్డుపై ప్రస్తుతం రూ.250+GST ఉండగా.. ఏప్రిల్ 1 నుంచి 325+GST వసూలు చేయనుంది. ఇక ప్రైడ్, ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డుపై రూ.350+GST మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తుండగా.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.425+GST వసూలు చేయనుంది.

Also Read: క్రెడిట్ కార్డు నిబంధనలను మార్చిన ఆర్బీఐ.. యూజర్లకు లాభమా ? నష్టమా ? తెలుసుకోండి..

క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై ఎలాంటి ఇష్యూరెన్స్ ఛార్జీలు ఉండవు. గోల్డ్ డెబిట్ కార్డుపై రూ.100+GST ఇష్యూరెన్స్ ఛార్జీలు, ప్లాటినం పై రూ.300+GST ఇష్యూరెన్స్ ఛార్జీలు వడ్డించింది. డెబిట్ కార్డు రీ ప్లేస్ మెంట్ ఛార్జీలు రూ.300+GSTగా నిర్ణయించింది. డూప్లికేట్ పిన్ లేదా పిన్ నంబర్ రీ జనరేషన్ కు అదనంగా రూ.50+GST వేసింది. ఇంటర్నేషనల్ ట్రాక్సాక్షన్స్ పై ఏటీఎంలలో బాలెన్స్ ఎంక్వైరీకి రూ.25+GST, ఏటీఎం క్యాష్ విత్ డ్రా ట్రాన్సాక్షన్లపై రూ.100+3.5 శాతం ట్రాన్సాక్షన్ అమౌంట్+GST, ఈ కామర్స్ ట్రాన్సాక్షన్లపై 3 శాతం ట్రాన్సాక్షన్ అమౌంట్+GST వసూలు చేయనున్నట్లు ఎస్ బీఐ వివరించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News