E-Paper
Advertisement

Ram Charan: రామ్ చరణ్‌కు భార్యపై ఎంత ప్రేమో.. బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయాల్సిందే భయ్యా..

Ram Charan: రామ్ చరణ్‌కు భార్యపై ఎంత ప్రేమో.. బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయాల్సిందే భయ్యా..
Advertisement

Ram Charan: ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రెటీలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీ జీవితాన్ని లీడ్ చేస్తుంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీపై ఎక్కువగా కేర్ తీసుకుంటుంటారు. ఇక సినిమాలు చేస్తున్న క్రమంలో చిన్న బ్రేక్ దొరికినా వేకేషన్ ప్లాన్స్ అంటూ ట్రిప్స్ వేస్తుంటారు.

Advertisement

ఇందులో ఎంతోమంది సెలబ్రెటీలు ఉండగా.. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఎంతో గాఢంగా ప్రేమించిన ఉపాసనను పెళ్లి చేసుకోవడానికి రామ్ చరణ్ ఓ స్టార్ హీరో కూతురిని రిజక్ట్ చేశాడట.

ఉపాసనను మ్యారేజ్ చేసుకోక ముందు చరణ్‌ వద్దకు ఓ స్టార్ హీరో కూతురిని పెళ్లి చేసుకోమని డిమాండ్ వచ్చిందట. అయితే ఆ డిమాండ్ తాను తిరస్కరించేశాడని టాక్. అయితే ఆ స్టార్ హీరో కూతురు మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత.

Advertisement

READ MORE: టీవీల్లోకి ‘హాయ్ నాన్న’.. డేట్ ఖరారు.. మరికొన్ని చిత్రాలు థియేటర్లలో

అప్పట్లో చిరంజీవి, వెంకటేష్ మధ్య చాలా మంచి స్నేహం ఉండేది. ఆ కారణంగానే చరణ్‌కి, వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితకి మ్యారేజ్ చేయాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని చిరు వెళ్లి చరణ్‌కు చెప్పాటడ.

దీంతో అప్పటికే ఉపాసనతో పీకల్లోతు ప్రేమలో ఉన్న చరణ్ ఈ డిమాండ్‌కు నో చెప్పాడట. తాను ఉపాసనను ప్రేమిస్తున్నానని.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని మెగాస్టార్‌కు తన మనసులోని మాట చెప్పేశాడట.

దీంతో మెగాస్టార్ చేసేదేమి లేక చరణ్‌కు ఉపాసనకు పెళ్లి చేశారు. అంతలా ప్రేమించిన ఉపాసన కోసం చరణ్ తన ఇంట్లో సైతం ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కాగా ఉపాసనపై చరణ్ చాలా కేర్‌గా ఉంటాడు.

తనకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తానే దగ్గరుండి మరీ సేవలు చేస్తుంటాడు. గతేడాది ఉపాసన ప్రసవించే సమయంలో కూడా చరణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన భార్య వద్దనే సేవలు చేసుకుంటూ ఉన్నాడు.

READ MORE: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్స్.. కారణం తెలిస్తే ఎగిరి గంతేస్తారు

అయితే తాజాగా తన భార్య ఉపాసనపై చరణ్ మరోసారి ప్రేమను కురిపించాడు. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు చరణ్ – ఉపాసన దంపతులు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో ఈ జంట జామ్ నగర్‌కు వెళ్లారు.

అయితే ఆ సమయంలో విమానంలో ఉపాసన నిద్రిస్తున్నప్పుడు చరణ్ ఆమె కాళ్లు నొక్కుతూ కనిపించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చరణ్‌కు బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×