BigTV English

Hi Nanna: టీవీల్లోకి ‘హాయ్ నాన్న’.. డేట్ ఖరారు.. మరికొన్ని చిత్రాలు థియేటర్లలో

Hi Nanna: టీవీల్లోకి ‘హాయ్ నాన్న’.. డేట్ ఖరారు.. మరికొన్ని చిత్రాలు థియేటర్లలో


Hi Nanna TV premier date: నేచురల్ స్టార్ నాని కొత్త కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. డిఫరెంట్ జానర్‌ను టచ్ చేయడంలో నాని ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ భారీ హిట్లు అందుకుంటున్నాడు. గతేడాది దసరా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత మరో సినిమా ‘హాయ్ నాన్న’తో పలకరించి అందరి మన్ననలు పొందాడు. హాయ్ నాన్న మూవీ గతేడాది డిసెంబర్‌లో రిలీజై ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీసు వద్ద కూడా అద్భుతమైన కలెక్షన్లను ఈ మూవీ నమోదు చేసింది. ఇందులో నానికి జోడీగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించి మెప్పించింది.


ఇక ఈ మూవీ థియేటర్ అనంతరం ఓటీటీలోకి వచ్చి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చి అదరగొట్టింది. అంతేకాకుండా టాప్ 5లో ట్రెండ్ అయింది. అయితే ఈ మూవీ హిందీ వెర్షన్ మాత్రం 50 రోజులవుతున్నా.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

READ MORE: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్స్.. కారణం తెలిస్తే ఎగిరి గంతేస్తారు

ఇప్పుడు టాప్ 10లో కొనసాగుతోంది. సోషల్ మీడియా ద్వారా కూడా ఈ మూవీని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఈ మూవీలో నాని నటనకు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రన్ అనంతరం ఇప్పుడు టీవీ ప్రీమియర్‌గా బుల్లితెర ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

తన అదృష్టాన్ని టీవీల్లో పరీక్షించేందుకు రెడీగా ఉంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ముదులిపేసిన ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ టీవీ ఛానల్ జెమినీ టీవీలో ప్రసారం అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 17న హాయ్ నాన్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జెమినీ టీవీలో ప్రసారం కానుంది.

ఇకపోతే ఈ మూవీలో నాని, మృణాల్ ఠాకూర్, జయరాం, కియారా ఖన్నా, నాజర్, ప్రియదర్శి, అంగద్ బేడీ వంటి నటీ నటులు నటించి మెప్పించారు.హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించగా.. వైరా ఎంటర్‌టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

READ MORE: ప్రీ వెడ్డింగ్ వేడుకకు బాయ్‌ఫ్రెండ్‌తో శ్రద్ధా కపూర్.. అది నిజమేనంటున్న నెటిజన్లు

ఇదిలా ఉంటే.. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ మూవీ నుంచి ఇటీవల గ్లింప్స్‌ రిలీజ్ చేయగా.. అందరినీ బాగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

‘సరిపోదా శనివారం’ మూవీ ఈ ఏడాది ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ తర్వాత నాని ‘బలగం’ దర్శకుడు వేణుతో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వేణు ఈ మూవీని కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తీసే అవకాశముందని టాక్ నడుస్తోంది.

దీని తర్వాత కూడా నాని తన లైనప్‌లో మరో మూవీని ఉంచాడు. పవన్ కల్యాణ్‌తో ‘ఓజీ’ తీస్తున్న దర్శకుడు సుజీత్‌తో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చే ఏడాది రిలీజ్ ఉంటుందని సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×