BigTV English

Jr NTR: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్స్.. కారణం తెలిస్తే ఎగిరి గంతేస్తారు

Jr NTR: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్స్.. కారణం తెలిస్తే ఎగిరి గంతేస్తారు


Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కలిసి దిగిన కొన్ని ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ముగ్గురు స్టార్స్ ఎందుకు కలిసినట్టు అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఇదే టాక్.

ఈ ముగ్గురు స్టార్స్ కలిసి ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నారా? అంటూ గుస గుసలాడుకుంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. అది ఓకే. కానీ ఫ్రేమ్ లోకి రిషబ్ శెట్టి ఎందుకు వచ్చాడు? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


అయితే ఆ అనుమానాలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ ఇంట్లో ఏదో శుభకార్యం ఉండటంతో ఈ ముగ్గురు కలిసినట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి వెళ్లాడు. వీరితో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవి శంకర్ కూడా ఫొటోలో కనిపిస్తున్నారు.

READ MORE: ప్రీ వెడ్డింగ్ వేడుకకు బాయ్‌ఫ్రెండ్‌తో శ్రద్ధా కపూర్.. అది నిజమేనంటున్న నెటిజన్లు

ఇక అదే శుభకార్యానికి ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి తన భార్య ప్రగతితో కలిసి హాజరయ్యాడు. దీంతో వీరందరూ కలిసి ఒకచోట చేరడంతో ఫొటోలకు ఫోజులిచ్చారు. అదీ గాక.. హోంబలే ఫిల్మ్స్‌కి.. ప్రశాంత్ నీల్‌కి.. రిషబ్ శెట్టికి మంచి అనుబంధం కూడా ఉన్న సంగతి తెలిసిందే. అందువల్లనే ఈ శుభాకార్యానికి ప్రశాంత్‌నీల్.. రిషభ్ శెట్టిని ఇన్వైట్ చేశాడని టాక్.

ఏది ఏమైనా సినీ స్టార్ దిగ్గజాలు అందరూ ఒకేచోట.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ప్రేక్షకాభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. తమ అభిమాన హీరోతో పాటుగా మరికొంత మంది స్టార్స్ ఒకేఫ్రేమ్‌లో ఉంటూ ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ అందించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ భారీ రెస్పాన్స్ అందుకుని సినిమాపై అంచనాలు పెంచేసింది.

మరోవైపు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కూడా ‘కాంతార’ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిందని.. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల తెరకెక్కించిన సలార్ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.

READ MORE: మొగలిరేకులు సీరియల్ ఫేమ్ దయ మృతి.. ఏం జరిగింది ?

కలెక్షన్లలో కూడా తన మార్క్ చూపించింది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ అబ్బురపరచింది. ఇక ఎన్టీఆర్ దేవర కంప్లీట్ చేసిన అనంతరం ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ మూవీ చేయబోతున్నాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×