E-Paper
Advertisement

Kalki2898AD: క్లింకార చేతికి చిక్కిన బుజ్జి.. ఏం చేస్తుందో చూడండి

Kalki2898AD: క్లింకార చేతికి చిక్కిన బుజ్జి.. ఏం చేస్తుందో చూడండి
Advertisement

Kalki2898AD: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో కల్కి 2898AD ఒకటి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్, స్వప్న దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసాయి. జూన్ 27 న కల్కి.. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. మునుపెన్నడూ లేనివిధంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే బుజ్జి అనే కారును పరిచయం చేసి.. దాన్ని చెన్నై వీధుల్లో తిప్పించి అటెన్షన్ గ్రాబ్ చేశారు. అంతేకాకుండా బుజ్జి అండ్ భైరవ పేరుతో ఒక యానిమేషన్ సిరీస్ ను అమెజాన్ లో రిలీజ్ చేశారు.

Advertisement

ఇందులో బుజ్జి.. భైరవకు ఎలా దొరికింది.. ? భైరవ.. బుజ్జి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తో కారును ఎలా రూపొందించాడు అనేది చూపించారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కల్కి మేకర్స్.. బుజ్జి బొమ్మ కార్లను కూడా రెడీ చేసి.. పిల్లలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మొదటి బుజ్జి కారు బొమ్మను.. రామ్ చరణ్ కుమార్తె క్లింకారకు బహుమతిగా పంపించారు. ఈ విషయాన్నీ ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

బుజ్జి కారు బొమ్మతో పాటు భైరవ స్టిక్కర్స్ తో క్లింకార ఆడుకుంటున్న ఫోటోను ఉపాసన షేర్ చేస్తూ .. కల్కి టీమ్ కు, ప్రభాస్ కు థాంక్స్ చెప్పడటతో పాటు సినిమా విజయం అందుకోవాలని అల్ ది బెస్ట్ కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిన్నారి క్లింకార.. బుజ్జితో తెగ ఆడేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఏదిఏమైనా ప్రమోషన్స్ విషయంలో నాగ్ అశ్విన్ స్ట్రాటజీనే వేరు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×