BigTV English

RC 16 Title: మెగా ఫ్యాన్స్‌కు షాక్.. పాపం చాలా అంచనాలు పెట్టుకున్నారు!

RC 16 Title: మెగా ఫ్యాన్స్‌కు షాక్.. పాపం చాలా అంచనాలు పెట్టుకున్నారు!

RC 16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan Tej) నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హై ఓల్టేజ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేయబోతున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ఆర్సీ 16 చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఇదే ఏడాదిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా ఫస్ట్ లుక్ గానీ, టైటిల్ గానీ రివీల్ చేయలేదు. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా.. టైటిల్ ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్ చేశారు. అయినా కూడా మెగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. దానికి కారణం లేకపోలేదు.


ప్రీ లుక్‌ పీక్స్.. ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్!

గేమ్ ఛేంజర్‌ సినిమాతో మెగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. దీంతో.. ఆర్సీ 16తో మెగా దాహం తీర్చడానికి రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కబడ్డీ, కుస్తీ, క్రికెట్‌తో పాటు మరికొన్ని క్రీడల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు ముందు నుంచి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ మధ్యలో ‘పవర్ క్రికెట్’ అనే టైటిల్ వినిపించింది. అయితే.. ఇప్పుడు ‘పెద్ది’ టైటిల్‌నే లాక్ చేసినట్టుగా తెలిసింది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా.. మార్చి 27న ఈ టైటిల్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఇదే విషయాన్ని సాలిడ్ ప్రీ లుక్‌తో ప్రకటించారు. మార్చ్ 27 ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ ప్రీ లుక్ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో రగ్డ్‌డ్ లుక్‌లో బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తున్న చరణ్.. వెనకాల చేతిలో చుట్టపట్టుకొని కనిపిస్తున్నాడు. దీంతో.. ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే.. ఫస్ట్ లుక్‌ టైటిల్‌తో పాటు ఒక స్పెషల్ వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నట్టుగా ముందు నుంచి ఊరిస్తు వచ్చాయి సినీ వర్గాలు. కానీ గ్లింప్స్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.


గ్లింప్స్ ఆరోజే?

చరణ్ బర్త్ డే ట్రీట్‌గా టైటిల్‌తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆల్రేడీ గ్లింప్స్ కూడా కట్ చేశారని వార్తలు కూడా వచ్చాయి. కానీ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆర్ఆర్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం.. వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం వల్ల గ్లింప్స్ రావడం లేదని సమాచారం. అందుకే.. కేవలం టైటిల్ , ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ నిరాశ తప్పదనే చెప్పాలి. అయితే.. గ్లింప్స్‌కు ఎక్కువ సమయం తీసుకోకుండా ఉగాదికి రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. గ్లింప్స్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదే ఏడాదిలో సినిమా రిలీజ్ అవుతుందని అందరు అంటుంటే.. ఇంకొందరు వచ్చే ఏడాదికి ఆర్సీ 16 షిప్ట్ అయినట్టుగా చెబుతున్నారు. కానీ ఎట్టిపరిస్థితుల్లోను ఇదే ఏడాదిలో ఆర్సీ 16 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరో నాలుగైదు రోజులు వెయిట్ చేస్తే.. ఆర్సీ 16 రిలీజ్ డేట్ విషయంలోను క్లారిటీ రానుంది.

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×