BANK OF BARODA: బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ జాబ్స్ అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా (BANK OF BARODA) లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫకేషన్ రిలీజ చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏప్రిల్ 15 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను సవివరంగా చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 146
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (డీడీబీఏ), ప్రైవేట్ బ్యాంకర్- రేడియన్స్ ప్రైవేట్, గ్రూప్ హెడ్, టెరిటోరి హెడ్, సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్, వెల్త్ స్ట్రాటిజిస్ట్, తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా ఉద్యోగాలకు చూసినట్లయితే..
డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్(డీడీబీఏ): 01 పోస్టు
ప్రైవేట్ బ్యాంకర్- రేడియన్స్ ప్రైవేట్: 03 పోస్టులు
గ్రూప్ హెడ్: 04 పోస్టులు
టెరిటోరి హెడ్: 17 పోస్టులు
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్: 101 పోస్టులు
వెల్త్ స్ట్రాటజిస్ట్(ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్సూరెన్స్): 18 పోస్టులు
ప్రొడక్ట్ హెడ్- ప్రైవేట్ బ్యాంకింగ్: 01 పోస్టు
పోర్ట్‌పోలియో రీసెర్చ్ అనలిస్ట్: 01 పోస్టు
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 15
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని వయస్సును నిర్ధారించారు. డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్టుకు 57 ఏళ్లు, ప్రైవేట్ బ్యాంకర్‌కు 33 – 50 ఏళ్లు, గ్రూప్ హెడ్‌కు 31-45 ఏళ్లు, టెరిటోరి హెడ్‌కు 27-40 ఏళ్లు, సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, వెల్త్ స్ట్రాటజిస్ట్(ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్సూరెన్స్), ప్రొడక్ట్ హెడ్‌కు 24 – 45 ఏళ్లు, పోర్ట్‌పోలియో రీసెర్చ్ అనలిస్ట్‌కు 22 – 35 ఏళ్లు వయస్సు ఉండాలి.
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జీతం: ఏడాదికి డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్‌కు రూ.18లక్షలు, ప్రైవేట్ బ్యాంకర్‌కు రూ. 14లక్షల నుంచి రూ.25లక్షలు, గ్రూప్ హెడ్‌కు రూ.16లక్షల నుంచి రూ.28 లక్షలు, టెరిటోరి హెడ్‌కు రూ.14లక్షల నుంచి రూ.25 లక్షలు, సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్‌కు రూ.8లక్షల నుంచి రూ.14 లక్షలు, వెల్త్ స్ట్రాటజిస్ట్‌కు రూ.12లక్షల నుంచి రూ.20లక్షలు, ప్రొడక్ట్ హెడ్‌కు రూ.10లక్షల నుంచి రూ.16 లక్షలు, పోర్ట్ పోలియో అనలిస్ట్‌కు రూ.6 లక్షల వేతనం ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.bankofbaroda.in/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీ సంఖ్య: 146
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 15
READ ALSO: ALP JOBS: గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది..