E-Paper
Advertisement

Rc16 Update: బ్రేకులు , గ్యాప్ లు లేవు , రంగస్థలం రేంజ్

Rc16 Update: బ్రేకులు , గ్యాప్ లు లేవు , రంగస్థలం రేంజ్
Advertisement

Rc16 Update: రామ్ చరణ్ తేజ్ ఒకప్పుడు తెలుగుకు మాత్రమే పరిమితమైన, ఇప్పుడు మాత్రం గ్లోబల్ స్థాయిలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. చిరుత సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేశాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. వాస్తవానికి ఈ సినిమా ఈ రోజుల్లో వచ్చుంటే పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా అని చెప్పొచ్చు. మగధీర సినిమా తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత చరణ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా అవి అంతంత మాత్రమే ఆడాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ధ్రువ సినిమాతో తనలో మంచి మేకవర్ చూపించాడు చరణ్.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో చిట్టిబాబు అనే పాత్రకు ప్రాణం పోసాడు చరణ్. ఇది కదా మెగాస్టార్ తనయుడి టాలెంట్ అంటే అని చాలా మందితో అనిపించాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చినా కూడా, రామ్ చరణ్ చేసిన రంగస్థలం క్యారెక్టర్ చాలామందికి ఫేవరెట్ అని చెప్పాలి. రామ్ చరణ్ లాంటి మాస్ కమర్షియల్ ఇమేజ్ ఉన్న హీరోని సుకుమార్ అలా చూపించి సక్సెస్ అవ్వడం అనేది గ్రేట్ థింగ్. ఇకపోతే అదే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు బుచ్చిబాబు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తన 16వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎక్కువ బ్రేకులు,గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు. వి ఎఫ్ ఎక్స్ (VFX) తో కూడిన సినిమా కాదు కనుక వీలైనంత ఫాస్ట్ గా ఈ స్పోర్ట్స్ డ్రామా ను పూర్తి చేయాలని భావిస్తున్నారట రామ్ చరణ్. రంగస్థలం తర్వాత మళ్ళీ రామ్ చరణ్ నటన గురించి ఆ రేంజ్ లో గట్టిగా మాట్లాడుకోవడం ఖాయం అంటున్నారు ఆ పాత్ర గురించి తెలిసిన వాళ్ళు.

Advertisement

బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ ప్రాంతానికి చెందిన చాలామందిని ఆడిషన్స్ కూడా చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. అలానే ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అప్పట్లో రామ్ చరణ్ సైడ్ ప్రొఫైల్ లో ఉన్న ఫోటో ఒకటి అప్లోడ్ చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సాలిడ్ మేకోవర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా మాసివ్ లుక్ లో రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రంగస్థలం మాదిరిగానే గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు చరణ్.

Also Read: The RajaSaab Update: 3 సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ , టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడే

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×