Drinking Water: ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేచిన వెంటనే కనీసం 1 గ్లాసు నీరు తాగాలని చెబుతారు. ప్రతి సీజన్‌లో ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీనికి చాలానే కారణాలు ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే నీరు తాగే అలవాటు మీ శరీరానికి మాత్రమే కాకుండా మీ మెదడుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తగినంత నీరు తాగకపోతే శరీరం, మెదడు సరిగా పనిచేయలేవు. మరి ఉదయం నిద్ర లేవగానే నీరు తాగడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరం 75 శాతం నీటితో కూడి ఉంటుంది. నీరు హైడ్రేషన్, మెదడు పనితీరుకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. వివరంగా చెప్పాలంటే.. నీటికి, మెదడుకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది.
నీరు త్రాగడం వల్ల మెదడుకు మేలు:
శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు.. అది మానసిక స్థితి, జ్ఞాపకశక్తి , ఏకాగ్రత సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అందుకే తగినంత నీరు త్రాగడం వల్ల మెదడుకు ప్రయోజనం చేకూరుతుంది. అంతే కాకుండా పనితీరు మెరుగుపడుతుంది. 2019 లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ రీసెర్చ్‌లో ఒక అధ్యయనం ప్రచురించబడింది. ఇది మెదడుపై డీహైడ్రేషన్ , రీహైడ్రేషన్ ప్రభావాల గురించి కొన్ని విషయాలను వెల్లడించింది.
ఈ అధ్యయనంలో 12 మంది పురుషులకు 36 గంటలు నీరు ఇవ్వకుండా వారి మానసిక పనితీరును అంచనా వేశారు. డీహైడ్రేషన్ వల్ల స్వల్పకాలిక జ్ఞాపకశక్తి , శ్రద్ధ తగ్గుతుందని పరిశోధనలు నిరూపించాయి. దీని వల్ల మెదడు పనితీరుపై హైడ్రేషన్ ప్రత్యక్ష ప్రభావం కూడా ఉంటుందని స్పష్టమైంది.
శరీరం, మెదడు సరిగ్గా పనిచేయడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం అవసరం. అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే నీరు త్రాగడం చాలా ముఖ్యం. ఈ అలవాటు రోజంతా శక్తిని , మానసిక స్పష్టతను కాపాడు కోవడానికి సహాయపడుతుంది. నిద్ర పోతున్నప్పుడు మన శరీరంలోకి ఆహారం లేదా ద్రవ పదార్థాలు తీసుకోకుండా ఉంటాము. దీని వల్ల శరీరంలో డీ హైడ్రేషన్ పెరుగుతుంది. మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత నీరు త్రాగినప్పుడు, ఇది అలసటను తగ్గిస్తుంది. అంతే కాకుండా మానసిక స్పష్టతను మెరుగుపరుస్తుంది.
Also Read: ఇలా చేస్తే.. ఎండాకాలంలో హెయిర్ ఫాల్‌కు చెక్ !
టీ, కాఫీ కంటే నీటికి ప్రాధాన్యత:
హైడ్రేషన్ మెదడు పనితీరు, శ్రద్ధ, ప్రతి చర్యలను మెరుగుపరుస్తుంది. ఇవి రోజంతా ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే నీరు శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా ముఖ్యమైంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి. తద్వారా శరీరం, మెదడు సరిగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నీటితో పాటు టీ , కాఫీ వంటివి కూడా హైడ్రేషన్‌కు దోహదం చేస్తాయి. కానీ నీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. తగినంత నీరు తాగినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా సమ్మర్ లో ఎక్కువగా నీరు, లేదా జ్యూస్ లు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి.