The RajaSaab Update: కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోనే కాకుండా ప్రభాస్ సినిమా అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభాస్ సినిమా కెరియర్ విషయానికొస్తే బాహుబలి సినిమా ముందు తర్వాత అని చెబుతూ ఉంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అంత మార్కెట్ లేదు అనుకునే తరుణంలో రిస్క్ చేసి మరి ఒక సినిమా కోసం ఏకంగా ఐదు సంవత్సరాలు టైం కేటాయించి బాహుబలి సినిమాని చేశారు దర్శకుడు రాజమౌళి. ఆ సినిమాతో ప్రభాస్ మార్కెట్ మాత్రమే కాకుండా తెలుగు సినిమా సాయి కూడా అమాంతం పెరిగిపోయింది. అక్కడినుంచి తెలుగు సినిమా పై మిగతా ఇండస్ట్రీలకు విపరీతమైన గౌరవం కూడా పెరిగింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే అది పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతుంది. రీసెంట్గా సలార్, కల్కి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా రాజా షాబ్. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.
ఈ రోజుల్లో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మారుతి. ఇప్పటివరకు మారుతి కెరియర్ లో ఒక డిజాస్టర్ సినిమా కూడా లేదు. ఇక ప్రస్తుతం మొదటిసారి తన కెరీర్ లో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు మారుతి. ఈ సినిమాకి సంబంధించి 10% టాకీ పార్ట్, అలాగే 3 సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ ఉన్నాయట. సినిమాకు సంబంధించిన టీజర్ రెడీ చేస్తున్నారు. దీనిని త్వరలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు జస్ట్ గ్లింప్స్ మాత్రమే వదిలారు. ఈ సినిమా టీజర్ తర్వాత మారుతి వర్క్ గురించి, ఈ సినిమా గురించి గట్టిగా మాట్లాడుకుంటారని ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మీద కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలు చేయలేదు. మారుతి స్ట్రెంత్ కామెడీ కాబట్టి ఈ సినిమాలో ఆ రేంజ్ కామెడీ చూపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
ఇక ప్రభాస్ కెరియర్ విషయానికొస్తే వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతోపాటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా పార్ట్ 2 చేయనున్నాడు. అలానే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో కాప్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇదివరకే అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ పనులు కూడా సందీప్ రెడ్డివంగా ఆల్రెడీ మొదలుపెట్టారు. ఒక సందీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా మాట్లాడడానికి అంటే ముందు 70%,80% మ్యూజిక్ రెడీ చేసుకుని సెట్స్ కి వెళ్తాడు. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో కూడా అలానే చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read: IIFA Digital Awards 2025: ఐఫా డిజిటల్ అవార్డ్స్ గ్రహీతలు వీరే.. ఎవరెవరంటే..?