BigTV English

Ram Pothineni: రవితేజ హీరోయిన్ తో రామ్ డేటింగ్.. ఉహించలేదుగా..?

Ram Pothineni: రవితేజ హీరోయిన్ తో రామ్ డేటింగ్.. ఉహించలేదుగా..?

Ram Pothineni : ప్రస్తుత కాలంలో చాలామంది సెలబ్రిటీలు తమకు నచ్చిన వారితో డేటింగ్ చేస్తూ రిలేషన్షిప్ కొనసాగిస్తూ ఉంటారు. కానీ అనూహ్యంగా ఆ బంధం బయటపడినప్పుడు తమకేమీ తెలియదు అన్నట్టు అమాయకంగా ప్రవర్తిస్తారు. మరికొంతమంది తమ బంధాన్ని ఎన్ని విధాలుగా దాచాలని ప్రయత్నం చేసినా ఏదోలాగా బయటపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే మాస్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని (Ram Pothineni) తాజాగా రవితేజ(Raviteja ) హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారని వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆమె ఎవరు? అసలు విషయం ఏమిటి? అనేది ఇప్పుడు చూద్దాం…


ఆమెతో డేటింగ్ చేస్తున్న రామ్ పోతినేని..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ అందుకున్న రామ్ పోతినేని స్టార్ హీరోల లీగ్ లోకి అడుగు పెట్టేంత సత్తా ఉన్న హీరో. కానీ ఒక సినిమా హిట్ కొడితే.. వరుసగా రెండు మూడు సినిమాలతో డిజాస్టర్ గా నిలవడం ఈయనకు అలవాటైపోయింది. దాంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం మీడియం రేంజ్ హీరో గానే కొనసాగుతున్నారు. ప్రస్తుతం.. అనుష్క (Anushka), నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కాంబినేషన్లో వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా డైరెక్టర్ పి. మహేష్ బాబు(Mahesh Babu) తో ఒక సినిమా చేస్తున్నారు. ఇందులో రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే (Bhagya Shree borse) అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఈమెతోనే రామ్ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.


రెండు నెలల నుండి వీళ్ళిద్దరూ కొత్త సినిమా చేస్తూ.. ఒకరికొకరు పరిచయం అయ్యారట. ఆ తక్కువ సమయంలోనే ఇద్దరి మనసులు కలిసాయని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో పూర్తి నిజాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలియడంతో అటు అభిమానులు కూడా జోడి చాలా క్యూట్ గా ఉంటుంది. భాగ్యశ్రీ లాంటి అందమైన అమ్మాయిని దక్కించుకోవడం రామ్ అదృష్టం అని కొంతమంది చెబుతుంటే.. మరికొంతమంది చాక్లెట్ బాయి లాంటి రామ్ ని దక్కించుకోవడం భాగ్యశ్రీ అదృష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ముంబైలో షూటింగ్ జరుగుతుండగా అక్కడే డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.

గాసిప్ రాయుళ్ల పనేనా..? 

అయితే… డేటింగ్ వార్తల్లో నిజం లేదు అనే వార్త కూడా వినిపిస్తుంది. వీరు ఇద్దరు కలిసి RAPO 22 అనే మూవీలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా నేపథ్యంలో హీరో, హీరోయన్లు కాస్త చనువుగా ఉండటం అనేది వేరీ కామన్. దీన్ని కొంత మంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలానే ఈ RAPO 22 మూవీలో కలిసి నటిస్తున్న భాగ్య శ్రీ బోర్సే, రామ్ పోతినేని చూసి కూడా లవర్స్ అని, డేటింగ్ చేస్తున్నారని గాసిప్ చేసి ఉంటారు అని కూడా టాక్ వస్తుంది. అయితే ఈ విషయంలో హీరో, హీరోయన్లు స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే…

భాగ్యశ్రీ సినిమాలు..

ఒక భాగ్యశ్రీ సినిమాల విషయానికొస్తే.. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా ఘోరమైన ఫ్లాప్ అందుకున్నప్పటికీ అమ్మడు అందానికి ఫిదా అయిపోయారు అభిమానులు. ఇక ప్రస్తుతం రామ్ పోతినేని తో సినిమా చేస్తోంది. మరి ఈ సినిమా భాగ్యశ్రీ కి ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి.

రామ్ సినిమాలు..

రామ్ విషయానికి వస్తే ‘దేవదాస్ ‘ సినిమాతో 2006లో ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ .. మొదటి సినిమాతోనే ఉత్తమ తొలి నటుడు కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఇక తర్వాత రెడీ, మస్కా, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ ,హలో గురు ప్రేమకోసమే , ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలు చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్లు చవిచూడడంతో ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×