BigTV English

Cyber Attack On Megha: మేఘా కంపెనీపై సైబర్ ఎటాక్.. ఎన్ని కోట్లు దోచారంటే..!

Cyber Attack On Megha: మేఘా కంపెనీపై సైబర్ ఎటాక్.. ఎన్ని కోట్లు దోచారంటే..!

Cyber Attack On Megha: సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం.. వేటిపై ఇంట్రస్ట్ చూపిస్తున్నాం అనే దానిపై కూడా అంచనా వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాటిని బట్టే అమాయికులను బుట్టలో వేసి నిండా ముంచేస్తున్నారు. ఒకటా రెండా ఎన్నెన్నో కేసులు. కోట్లలో నష్టపోతున్నారు జనం. కొత్త కొత్త విధానాల్లో అమాయిక జనాలను నిండా ముంచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. బయటపడే దాకా సైబర్ నేరం జరిగిందనే విషయం, తాము మోసపోతున్నాం అనేది కూడా జనం తెలుసుకోలేకపోతున్నారు.


తెలిసాక ఏమి చేయలేని పరిస్థితి. సాధారణ నేరాలకంటే.. సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన పెంచుతోంది. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి బడా పారిశ్రామిక వేత్తలు, కంపెనీల దాకా సైబర్ నేరగాళ్లు ఎవరిని వదలడం లేదు. స్మార్ట్ ఫోన్లతోనే సింపుల్‌గా పనికానిచ్చేస్తూ.. ఏటా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు.

దేశంలో సైబర్ క్రైమ్ పెద్ద సవాల్‌గా మారింది. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఏ చిన్న అవకాశం ఉన్నా సరే దోపిడీకి పాల్పడుతున్నారు. చదువుకున్న వాళ్లు, చదువురాని వాళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు తెలుగు రాష్ట్రాల్లో చిక్కుకుంటున్నారు.


గతంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా ఉండేవి. ఈ మధ్యకాలంలో వేరే రకంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కానీ పాత పద్దతిలోనే సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నట్లు ఈ కేసులో బయటపడింది.  తాజాగా సైబర్ నేరగాళ్లు మేఘా కంపెనీని కూడా వదల్లేదు. నకిలీ మెయిల్‌తో 5 కోట్ల 47 లక్షలు కొట్టేశారు. దాందో మేఘా కంపెనీ ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్‌మెంట్ కోసం.. నెదర్లాండ్స్‌కి చెందిన కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు.

Also Read: జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద BMW కారు బీభత్సం.. మద్యం మత్తులో రెచ్చిపోయిన డ్రైవర్

ఆ కంపెనీకి ఆన్‌లైన్‌ ద్వారా డబ్బుల చెల్లింపులు చేశారు. చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది. ఆ కంపెనీ లాగానే ఈ-మెయిల్ లో అక్షరం మార్చి మెయిల్ చేశారు కేటుగాళ్లు. అకౌంట్‌ పనిచేయడం లేదు మరో ఖాతాకు పంపించాలని మేఘా కంపెనీకి మెయిల్ చేశారు.అదే నిజమని నమ్మి రూ.5 కోట్ల 47 లక్షలు రెండు విడతలుగా చెల్లించారు. మళ్లీ ఆ కంపెనీ నుండి మెసేజ్ రావడంతో మోసపోయామని గ్రహించి మేఘా ఇంజనీరింగ్ మేనేజర్ శ్రీహర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను అణ్వేషిస్తూ.. అమాయికుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. సైబర్ నేరాలపట్ల ప్రతిక్షణం అప్పమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

 

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×