E-Paper
Advertisement

Ram Pothineni: ఆగిన డబుల్ ఇస్మార్ట్.. రామ్ రెమ్యూనిరేషన్ కారణం.. ?

Ram Pothineni: ఆగిన డబుల్ ఇస్మార్ట్.. రామ్ రెమ్యూనిరేషన్ కారణం.. ?
Advertisement

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో రామ్ ఆశలన్నీ.. డబుల్ ఇస్మార్ట్ మీదనే పెట్టుకున్నాడు. పూరి జగన్నాథ్- రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతుంది.

ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి, ఛార్మీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం రామ్ పారితోషికమని అంటున్నారు. ఈ సినిమా కోసం రామ్.. భారీ రెమ్యూనిరేషన్ ను డిమాండ్ చేశాడని.. ఆర్థిక సమస్యల వలన డబుల్ ఇస్మార్ట్ మధ్యలోనే ఆగిపోయిందని టాక్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో నిజం లేదని తెలుస్తోంది. రామ్ పారితోషికం వలన మాత్రమే ఈ సినిమా ఆగిపోలేదట. ఇంకా చెప్పాలంటే అస్సలు రామ్.. ఈ సినిమాకు రెమ్యూనిరేషన్ తీసుకోవడం లేదట.

Advertisement

సినిమా ప్రాఫిట్ లో షేర్స్ తీసుకోవడానికి రెడీ అయ్యి డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట అడ్వాన్స్ అయినా తీసుకొని చేయాలనుకున్నాడట.. కానీ అది కూడా కష్టంగా ఉండడంతో ప్రాఫిట్ లోనే మొత్తం తీసుకుందామని.. డబ్బు తీసుకోకుండా సినిమా చేస్తున్నాడట రామ్. ఇది ఒకరకంగా సినిమాకు మంచిదేమో కానీ, రామ్ కు నష్టమే మిగులుతుంది. సినిమా హిట్ అయితే ఓకే కానీ..ఒకవేళ ప్లాప్ అయితే మాత్రం ఎక్కువ నష్టపోయేది రామ్ మాత్రమే. అయితే రామ్ డబ్బు విషయాన్నీ పెద్దగా పట్టించుకోడు అనుకుంటే.. సినిమాల ప్లాప్ టాక్ తో అతని ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే ప్లాప్ ల మీద నడుస్తున్న రామ్. మరో ప్లాప్ ను మూట కట్టుకుంటాడో.. హిట్ అందుకొని సక్సెస్ తో పాటు షేర్స్ కూడా అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×