E-Paper
Advertisement

Ramayanam: బాలీవుడ్‌ రామాయణానికి బ్రేక్.. అసలేం ఏమైంది? రీజన్ ఇదేనా?

Ramayanam: బాలీవుడ్‌ రామాయణానికి బ్రేక్.. అసలేం ఏమైంది? రీజన్ ఇదేనా?
Advertisement

Break for Bollywood Ramayana Movie: రామాయణ మహా కావ్యాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ నితీశ్ తివారీ ఓ ప్రాజెక్టు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా తాత్కాలికంగా పెండింగ్‌లో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధుమంతెన, నమిత్ మల్హోత్రా తెరకెక్కించాలనుకున్నారు. దర్శకత్వ బాధ్యతలను బాలీవుడ్ దర్శకుడు రవి ఉడయార్, నితీష్ తివారీలు తీసుకున్నారు. అయితే ‘రామాయణ’ ప్రీ ప్రొడక్షన్ కోసం దర్శకులు ఇద్దరూ తెగ కష్టపడ్డారు. కానీ సడెన్‌గా ఏమైందో తెలియదు. ఇప్పటికీ తెర మీదకు రావడం లేదు. తర్వాత రవి ఉడయార్ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇంకా, సినిమా స్క్రిప్ట్ బాధ్యతలకు సంబంధించిన పని మొత్తం నితీష్ తివారి తీసుకున్నారు.

Advertisement

‘రామాయణ’ ప్రాజెక్ట్ విషయంలో నిర్మాతలు అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెనల మధ్య ఊహించని విధంగా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని బాలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. తర్వాత కన్నడ సూపర్ స్టార్ యశ్‌ను డైరెక్టర్ నిర్మాతగా చేర్చుకున్నారు. ‘రామాయణ’ సినిమాను నిర్మిస్తున్నట్లు పరోక్షంగా ప్రకటించడంతో అంతకుముందు వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ నిజమేనని అనుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు విషయంలో అల్లు అరవింద్, మధువంతెనలు ఆగ్రహించారు.

‘రామాయణ’ సినిమా టైటిల్, స్క్రిప్ట్ తదితర విపయాల్లో నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ ఎంటర్ టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హక్కులు లేవని, అల్లుమంతెన మీడియా వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ పేరిట ఓ పబ్లిక్ నోటీస్ జారీ చేయడంతో ఓ బాంబు పేల్చినట్లు అయింది. దీంతో హిందీ ‘రామాయణ’ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు వార్తల వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా బ్రేక్ పడిందా? తాత్కాలికంగా రద్దు అయిందా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

Also Read: సింధూర పువ్వు బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడు చూడండి ఎలా మారిందో..?

హిందీ రామాయణలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా దేవ్ దత్తా, శూర్పణకగా రకుల్‌ప్రీత్ సింగ్, లక్ష్మణుడిగా నవీన్ పొలిశెట్టి నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి చేస్తున్నట్లు ఫోటోలు సైతం హల్ చల్ చేశాయి. మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏర్పడిన వివాదం కొనసాగితే మాత్రం బాలీవుడ్‌తోపాటు సినిమా ప్రేక్షకులకు నిరాశ పడే అవకాశం ఉండనుంది.

 

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×