E-Paper
Advertisement

Rana Naidu 2 Update: ‘రానా నాయుడు 2’లో పవర్‌ఫుల్ విలన్.. ఆ పాత్రలో దుమ్ము దులిపేస్తాడంట!

Rana Naidu 2 Update: ‘రానా నాయుడు 2’లో పవర్‌ఫుల్ విలన్.. ఆ పాత్రలో దుమ్ము దులిపేస్తాడంట!
Advertisement

Update on Rana Naidu 2 Web Series: ఈ మధ్య ఓటీటీలకు మంచి గిరాకి పెరిగింది. స్టార్ హీరోల సైతం ఓటీటీలో కనిపించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బడా హీరోలు ఓటీటీలో సినిమా, సిరీస్‌లు చేసి ఆడియన్స్‌ను అలరించారు. అందులో టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఒకరు. గతేడాది ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో వెంకటేష్, రానా కలిసి నటించారు. గతేడాది మార్చి 10 ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

అయితే స్ట్రీమింగ్ అయిన మొదటి నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ సిరీస్‌పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. దానికి కారణం ఇందులో అసభ్యకర సన్నివేశాలు ఉండటం. అందువల్ల ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ లేకపోతే ఇలాంటి కంటెంట్‌లు తీస్తారా?.. అంటూ ఆ మధ్య విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా హీరో వెంకటేష్‌ను కూడా తీవ్రంగా ట్రోల్ చేశారు. ఆయన నోటివెంట బూతులు వినాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదని ఆయన ఫ్యాన్స్ కూడా మాట్లాడుకున్నారు.

Advertisement

ఎన్నో సినిమాల్లో తన నటనతో, కామెడీ డైలాగ్‌లతో, ఎమోషన్ సన్నివేశాలను సైతం పిప్పి పిండిచేసిన వెంకటేష్.. ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయడమేంటని ట్రోల్స్ చేశారు. అయితే మరికొందరు మాత్రం ప్రస్తుత జెనరేషన్‌కు తగ్గట్టుగా హీరోలు కూడా తమ క్యారెక్టర్లను, స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటున్నారని చర్చించుకున్నారు.

కాగా ఈ సిరీస్ విడుదలయ్యి ఏడాది పూర్తవడంతో ఈ సిరీస్‌ సీక్వెల్‌కు సంబంధించి ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీక్వెల్ సిరీస్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కోసం ‘ఏజెంట్’ మూవీ నటుడిని మేకర్స్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు. ‘ఏజెంట్’ మూవీలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించిన డినో మోరియా.

Advertisement

Also Read: రానా నాయుడు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న నెట్‌ఫ్లిక్స్..

ఈ నటుడు రానా నాయుడు 2తో ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ తన పాత్రకు సంబంధించి కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన పాత్ర ఇందులో ఎంతో కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక త్వరలో మిగతా నటీనటుల కూడా సెట్‌లో అడుగుపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఫస్ట్ పార్ట్‌లో కనిపించే నటీ నటులు కూడా ఈ సెకండ్ పార్ట్‌లో కంటిన్యూ అవుతారని తెలుస్తోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×