BigTV English

Rajinikanth – Lokesh Movie: రజినీకాంత్ – లోకేష్ మూవీలో టాలీవుడ్ బడా హీరో!

Rajinikanth – Lokesh Movie: రజినీకాంత్ – లోకేష్ మూవీలో టాలీవుడ్ బడా హీరో!

Akkineni Nagarjuna in Rajinikanth – Lokesh Kanagaraj Movie : 60 ఏళ్ల వయసులో కూడా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎక్కడా తగ్గడం లేదు. కుర్ర హీరోలతో సమానంగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానుల్ని అలరిస్తున్నాడు. గతేడాది ‘జైలర్’ మూవీతో వచ్చి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీకి ముందు వరకు ఎలాంటి హిట్లు లేకుండా వరుస ఫ్లాపులతో చానా ఇబ్బంది పడ్డాడు.


అయితే ‘జైలర్’ మూవీ రజినీకి, అతడి అభిమానులకు ఆకలిని తీర్చింది. బాక్సాఫీసు వద్ద కళ్లు చెదిరే కలెక్షన్లను నమోదు చేసింది. ఏకంగా బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అబ్బురపరచింది. దీంతో రజినీ ఫ్యాన్స్‌లో ఫుల్ ఎనర్జీ వచ్చింది. ఇక ఈ మూవీ తర్వాత ‘లాల్ సలాం’ మూవీలో కీలక పాత్రలో నటించాడు రజినీ. ఈ మూవీ కూడా మంచి అంచనాలతో వచ్చింది. కానీ బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇకపోతే రజినీ కాంత్ ప్రస్తుతం తన కెరీర్‌లో 171వ చిత్రాన్ని చేసేందుకు సిద్దమయ్యాడు. దర్శకుడు లోకేష్ కనగరాజు డైరెక్షన్‌లో ‘తలైవర్ 171’ వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ‘విక్రమ్’ మూవీతో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన లోకేష్.. ఇప్పుడు రజినీకాంత్ మూవీకి కూడా అలాంటి రేంజ్ హిట్‌నే అందిస్తాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Also Read: రజినీకాంత్ – లోకేష్ కాంబో.. టైటిల్ ఇదే..!

ఈ మూవీలో రజినీ కూతురిగా నటి శృతి హాసన్‌ను మేకర్స్ ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సినిమా మొత్తం తండ్రి కూతుళ్ల మధ్య నడుస్తుందని సమాచారం. అయితే ఇప్పుడు మరొక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కింగ్ నాగార్జున ‘తలైవర్ 171’ మూవీలో అతిథి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇందులో ఆయన పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కళుగు’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలో వచ్చే అవకాశముంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×