E-Paper
Advertisement

Ranveer Singh : తండ్రిగా ప్రమోషన్ వచ్చాక కొత్త కారు కొన్న రణ్వీర్ సింగ్… నెంబర్ ప్లేట్ వెనకున్న సీక్రెట్ ఇదే

Ranveer Singh : తండ్రిగా ప్రమోషన్ వచ్చాక కొత్త కారు కొన్న రణ్వీర్ సింగ్… నెంబర్ ప్లేట్ వెనకున్న సీక్రెట్ ఇదే
Advertisement

Ranveer Singh : బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ రీసెంట్ గా తండ్రిగా ప్రమోషన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ జంట తల్లిదండ్రులయ్యారు. ఇక రీసెంట్ గా కూతురితో కలిసి దీపిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, తాజాగా రణ్వీర్ సింగ్ ఒక్క కొత్త లగ్జరీ కారును కొనడం విశేషం. ఇక ఈ కారు కోసం భారీగా ఖర్చుపెట్టిన రణ్వీర్ సింగ్ కారు నెంబర్ ప్లేట్ కోసం కూడా స్పెషల్ నెంబర్ ను వేయించుకున్నట్టుగా తెలుస్తోంది.

రణ్వీర్ సింగ్ గ్యారేజీలోకి కొత్త కారు 

Advertisement

మహాలక్ష్మి లాంటి కూతురు తన ఇంట్లో అడుగు పెట్టడంతో సంతోషంగా ఉన్న రణ్వీర్ సింగ్ దంపతులు ఇప్పుడు తమ ఇంటికి కొత్త కారుని కూడా ఆహ్వానించారు. ఇప్పటికే రణ్వీర్ సింగ్ దగ్గర పలు లగ్జరీ కార్లు ఉండగా, దానికి తోడు ఇప్పుడు రణ్వీర్ సింగ్ గ్యారేజీలో మరో కారు కూడా చేరింది. తాజాగా రణ్వీర్ సింగ్ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికోసం ఏకంగా ఆయన 4.74 కోట్లు చెల్లించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కారుకు ప్రత్యేక కార్ నెంబర ను కూడా తీసుకున్నారు. ఈ నెంబర్ ప్లేట్ కోసం కూడా రణ్వీర్ సింగ్ భారీ మొత్తంలో చెల్లించినట్టు సమాచారం.

రణ్వీర్ సింగ్ కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ 4.4 ఎల్ డబ్ల్యూబి కారు రేంజ్ రోవర్ సిరీస్ లోనే అత్యుత్తమ టాప్ ఎండ్ కార్లలో ఒకటి. ఇక ఆయన ఈ కారులో కూతురు కోసం ప్రత్యేకంగా కష్టమైజ్డ్ మార్పులను కూడా చేయించినట్టుగా సమాచారం. అలాగే ఆయన ఈ కారుకు 6969 అనే నెంబర్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

కారు నెంబర్ సీక్రెట్ ఇదే 

అదే నెంబర్ తీసుకోవడానికి గల ప్రత్యేకమైన కారణం ఏంటంటే రణ్వీర్ సింగ్ కు ఇది ఫేవరెట్ నెంబర్ అని సమాచారం. ఇక తండ్రి కాగానే రణ్వీర్ సింగ్ కొంతకాలం సినిమా నుంచి బ్రేక్ తీసుకున్నారు. త్వరలోనే రణవీర్ సింగ్, దీపిక జంటగా నటించిన ‘సింగం అగైన్’ మూవీ దీపావళి కానుకగా వచ్చే వారం రిలీజ్ కాబోతోంది. మరోవైపు ఆయన ‘దురంధర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు శంకర్ దర్శకత్వంలో ‘అన్నియన్’ అనే హిందీ రీమేక్ లో చేయబోతున్నాడు. ఇక దీపిక చివరిసారిగా ‘కల్కి’ అనే సినిమాలో నటించింది.

ఇదిలా ఉండగా సెలబ్రిటీలు ఇలా తమకు ఇష్టమైన నెంబర్ ప్లేట్ ను కొనడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తనకు ఇష్టమైన కార్ నెంబర్ ను తీసుకున్నారు. ఆయన బర్త్ డే 27 కాబట్టి కొత్త కార్ నెంబర్ 2727 గా తీసుకున్నట్టు సమాచారం. అలాగే మిగతా కార్లకు కూడా 27 నెంబర్ తో ముడిపడి ఉండేలా నెంబర్ ప్లేట్ తీసుకున్నారు చెర్రీ. ఇప్పుడు దాదాపు ఇదే స్టైల్ లో రణ్వీర్ సింగ్ కూడా తనకు ఇష్టమైన నెంబర్ ప్లేట్ తీసుకుని వార్తల్లో నిలిచారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×