BigTV English

Bandi Sanjay on KTR: కేటీఆర్.. తాటాకు చప్పుళ్లకు భయపడేదు లేదు, నేనూ నోటీసులిస్తా – బండి సంజయ్

Bandi Sanjay on KTR: కేటీఆర్.. తాటాకు చప్పుళ్లకు భయపడేదు లేదు, నేనూ నోటీసులిస్తా – బండి సంజయ్

Bandi Sanjay on KTR: తెలంగాణలో రాజకీయాలు లీగల్ నోటీసుల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైనట్టు కనిపిస్తున్నాయి. రాజకీయంగా ఎదుర్కోలేక లీగల్ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ నేతలు.


లేటెస్ట్‌గా కేంద్ర మంత్రి బండి సంజయ్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారంటూ లీగల్ నోటీసులు పంపారు మాజీ మంత్రి కేటీఆర్. దానికి కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. రాజకీయంగా తమను ఎదుక్కోలేక నోటీసులా? అంటూ ప్రశ్నించారు.

విమర్శలకు నోటీసులే సమాధానమా అంటూ మనసులోని మాట బయటపెట్టారు. మేము కూడా నోటీసులు పంపిస్తామని, కాచుకో అంటూ వ్యాఖ్యానించారు. తనను అవమానిస్తే బదులిచ్చానని, మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబు ఇస్తానని చెప్పకనే చెప్పేశారు కేంద్రమంత్రి బండి సంజయ్.


తొలుత వ్యక్తిగతంగా తనపై ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరేనని గుర్తు చేశారాయన. అందుకు బదులుగా తాను మాట్లాడానని, ఆయన బాగోతం ప్రజలకు తెలుసన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో ప్రజలందరికీ తెలుసన్నారు.

ALSO READ:  కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు, క్షమాపణలు చెప్పాల్సిందే

ఇప్పటివరకు మాటకు మాటతోనే బదులిచ్చానని అన్నారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులమని, మేము ఆ ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఈ లెక్కన రేపో మాపో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశముందని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×