BigTV English

Rashmika Mandanna: ఏ మగాడు చెయ్యనిపని అల్లు అర్జున్ చేశాడు.. రష్మిక షాకింగ్ కామెంట్స్..

Rashmika Mandanna: ఏ మగాడు చెయ్యనిపని అల్లు అర్జున్ చేశాడు.. రష్మిక షాకింగ్ కామెంట్స్..

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పలు ఛానెల్స్ ఇంటర్వ్యూ లో పాల్గొంటు సినిమాలోని హైలెట్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ అమ్మడు అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించింది అదే ఇప్పుడు ఆమె కొంప ముంచింది.. అదేంటి అనుకుంటున్నారా? అవునండి రష్మిక మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అసలు రష్మిక ఏం మాట్లాడిందో ఇప్పుడు తెలుసుకుందాం..


దేశ వ్యాప్తంగా పుష్ప 2 మేనియా కొనసాగుతుంది.. టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. నార్త్ టూ సౌత్ థియేటర్లలో పుష్ప మోత మాములుగా లేదు. సినిమాలో యాక్షన్ సీన్స్‌ని ఏ రేంజ్‌లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారో.. ఎమోషన్స్ సీన్స్‌కి కూడా అలానే ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్‌ని థియేటర్లలో నిజంగానే పూనకాలతో ఊగిపోతున్నారు.. ఈ మూవీ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో రెండు వారాలకే 1650 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకున్న కూడా ఆ హ్యాపీనెస్ యూనిట్ మొఖాల్లో కనిపించలేదు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన ఘటన గాయపడిన శ్రీతేజ్ హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతనికి అలా ఉంటే సెలెబ్రేషన్సా అంటారని చడి చప్పుడు కాకుండా మౌనంగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా పుష్ప 2 హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో రష్మిక మందన మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. అసలు మ్యాటరేంటంటే.. పుష్ప 2 సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న వేళ రష్మిక మందన ఓ ప్రముఖ మూవీ వెబ్‌సైట్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో పుష్ప 2 సినిమా విశేషాలతో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ సహా పలు కీలక విషయాలు మాట్లాడింది. అయితే జాతర సీక్వెన్స్‍లో బన్నీ యాక్టింగ్ గురించి చెబుతూ రష్మిక చేసిన కామెంట్లపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్..


అందులో ఆమె మాట్లాడుతూ.. జాతర సీన్ చూశాక 21 నిమిషాల పాటు ఒక మగాడు చీరలో ఉండటం అంటే మామూలు విషయం కాదు. మీరు ఊహించండి ఒక చీర కట్టుకొని డ్యాన్స్ చేయడం, ఫైట్ చేయడం, డైలాగ్స్ చెప్పడం.. ఇవన్నీ చేయడానికి ఎంత ధైర్యం, పవర్ కావాలి. అసలు అలా ఏ మగాడు చేస్తాడు చెప్పండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ డీలక్స్, కాంచన, భామనే సత్యభామనే వంటి సినిమాలు రష్మిక చూసిందా అంటూ కొశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే సూపర్ డీలక్స్‌లో విజయ్ సేతుపతి, కాంచనలో శరత్ కుమార్, లారెన్స్, భామనే సత్యభామనేలో కమల్ హాసన్ ఇలా ఎంతోమంది స్టార్ యాక్టర్స్.. లేడీ గెటప్స్‌లో అద్భుతంగా నటించారు. ఆ సినిమాలు రష్మిక చూడలేదా ఏంటి అని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై ఈమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×