Tamannaah Assets:స్టార్ హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేంత అందచందాలతో.. పాలమీగడ లాంటి మేని ఛాయతో యువతను ఆకట్టుకున్న ఏకైక హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్న. అందంతోనే కాదు నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఈరోజు తమన్నా పుట్టినరోజు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 ఏళ్లకు పైగానే అవుతున్నా.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో కలుపుకొని మొత్తం 50కి పైగా చిత్రాలలో నటించి, మంచి పేరు దక్కించుకుంది. ఒక సినిమాలే కాదు.. యాడ్స్, వెబ్ సిరీస్ అంటూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె ఈ 18ఏళ్ల సినీ కెరియర్లో ఎంత ఆస్తి కూడబెట్టింది అనే విషయం వైరల్ గా మారింది.
హిందీ సినిమాతో తొలి ఎంట్రీ..
తమన్నా 2005లో తనకు 15 సంవత్సరాల వయసున్నప్పుడు హిందీలో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అదే సంవత్సరం ‘శ్రీ’ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఈ సినిమాతో పెద్దగా గుర్తింపు లభించలేదు కానీ ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ సినిమాతో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఆ తరువాత 2011లో వచ్చిన ‘100% లవ్’ సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత వరుసగా ‘రచ్చ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘రెబల్’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ వంటి సినిమాలతో అదరగొట్టిన ఈమె దాదాపు స్టార్ హీరోలతోనే జతకట్టి తనను తాను ప్రూవ్ చేసుకుంది. దాంతో ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది తమన్నా.
మొత్తం ఆస్తి విలువ..
ఎస్.ఎస్.రాజమౌళి(S.S.Rajamouli)దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. ఒక సినిమాలలోనే కాదు ‘లస్ట్ స్టోరీస్’ వంటి వెబ్ సీరీస్ లో కూడా నటించి ఆకట్టుకుంది. ఇకపోతే తమన్నా సినిమాలు, వెబ్ సిరీస్ లు, యాడ్స్ లో కూడా నటిస్తూ భారీగా వెనకేసుకుంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పిలవబడే జుహూ ఏరియాలో రూ.16.60 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్మెంట్ ను కలిగి ఉంది. దీని విస్తీర్ణం 80,778 చదరపు అడుగులు ఉంటుందని సమాచారం. ఇక తమన్నా సుమారుగా రూ. 200 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉందని తెలుస్తోంది. ఇక ఒక్కో సినిమాకు రూ .3కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈమె.. ఒక ఐటెం సాంగ్ చేస్తే రూ. కోటికి పైగానే రెమ్యూనరేషన్ పొందుతోందని సమాచారం..
తమన్నా కార్ కలెక్షన్.
ఇక తమన్నా కారు కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.43.50 లక్షల విలువైన బీఎండబ్ల్యూ, రూ.75.59 లక్షల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్ కార్ తో పాటు రూ.1.02 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ అలాగే రూ.29.96 లక్షల విలువైన మిత్సుబిషి పేజర్ స్పోర్ట్స్ కారు కూడా ఈమె కార్ గ్యారేజీ లో ఉన్నాయి. అంతేకాదు ఈమె ఉపయోగించే ఒక్కో హ్యాండ్ బ్యాగ్ ధర రూ3లక్షల పై మాటే. అంతేకాదు ఈమె దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఐదవ వజ్రం ఈమె దగ్గర ఉంది. దీని విలువ సుమారుగా రూ.2కోట్ల పైగానే ఉంటుందని సమాచారం. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సమయంలో రాంచరణ్ (Ram Charan)సతీమణి ఉపాసన(Upasana) బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.