BigTV English

Rashmika: బోల్డ్ నెస్ తో హీట్ పుట్టించేస్తున్న రష్మిక.. యమ హాట్ గురూ..!

Rashmika: బోల్డ్ నెస్ తో హీట్ పుట్టించేస్తున్న రష్మిక.. యమ హాట్ గురూ..!

Rashmika.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) గీతాగోవిందం తర్వాత తన స్టార్ డంను మరింత పెంచుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గీతా గోవిందంలో గీత పాత్రను అంత తేలిగ్గా ఎవరు మర్చిపోలేరు. అలాగే ఇప్పుడు పుష్ప లోని శ్రీవల్లిని కూడా ఎవరు మర్చిపోలేరు అనడంలో సందేహం లేదు. అంతలా తన అద్భుతమైన పాత్రలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ రెండు పాత్రలు ప్రేక్షకులను ఎలా అయితే మెప్పించాయో ఇప్పుడు మిలన్ ఫ్యాషన్ వీక్ 2024 లో రష్మిక లుక్స్ కూడా అందర్నీ అలా ఆకట్టుకున్నాయి. ఈమె లుక్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. తన గ్లామర్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పవచ్చు.


ట్రెండీ లుక్ లో అందరినీ ఆకర్షించిన రష్మిక..

రష్మికను ఇలా కొత్తగా ట్రెండీగా చూడడం ఇదేం మొదటిసారి కాకపోయినా ఈసారి మాత్రం రెబలిజం కాస్త హద్దు మీరింది. పాశ్చాత్య ధోరణి పరాకాష్టకి చేరిపోయిందని చెప్పవచ్చు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదనే చెప్పాలి. ఎందుకంటే దీనిని డిజైన్ చేసింది పాశ్చాత్య డిజైనర్ కాబట్టే ఆ మూలాలు ఈ డిజైనర్ డ్రెస్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా మిలన్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్ లో కనిపించిన ఈమె తన లుక్ తోనే అందరిని ఆకట్టుకుంది. శనివారం మిలన్ ఫ్యాషన్ వీక్ షో తర్వాత పార్టీలో హాజరైన ఈమె ఇదే డ్రెస్ లో హాజరై అక్కడ ఆ ఈవెంట్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరిలో కూడా షో స్టాపర్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఈమె హాట్ గ్లామర్ కి యువత సైతం ఫిదా అయిపోతున్నారు.


డిజైన్ చేసింది ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్..

Rashmika: Rashmika is creating heat with her boldness.. Yama Hot Guru..!
Rashmika: Rashmika is creating heat with her boldness.. Yama Hot Guru..!

ఇక దీనిని డిజైన్ చేసింది ఎవరో కాదు ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ డోనాటెల్లా వెర్సాస్. వీరు ప్రస్తుతం చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. ఇకపోతే రష్మిక అద్భుతమైన ఐవరీ బ్లేజర్ డ్రెస్, గ్లామర్ మేకప్ లో అందరిని ఆకట్టుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

రష్మిక సినిమాలు..

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ఛావా లో ఈమె కనిపించనుంది. ఆ తర్వాత ధనుష్ , నాగార్జున కాంబినేషన్లో వస్తున్న కుబేర సినిమాలో కూడా కనిపించనుంది. వీటితోపాటు ది గర్ల్ ఫ్రెండ్ లో దీక్షిత్ శెట్టితో స్క్రీన్ పంచుకోబోతోంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు డిసెంబర్ 6వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న పుష్ప: ది రూల్ సినిమా కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఇదివరకే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలుసు. అందులో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక కి కూడా మంచి పేరు లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2 కూడా డిసెంబర్ ఆరో తేదీ రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×