BigTV English
Advertisement

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Rhea Singha, the Miss Universe India 2024: ‘మిస్ యూనవర్స్ ఇండియా 2024’ కిరీటాన్ని రియా సింఘా దక్కించుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’ పోటీల్లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల రియా గెలుపొందారు. గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 51మంది ఫైనలిస్టులను అధిగమించి రియా సింఘా విజేతగా నిలిచింది. దీంతో రియా.. ఈ ఏడాది మెక్సికోలో జరగనున్న ప్రపంచ మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారత్ తరఫున బరిలో నిల్చోవడానికి అర్హత సాధించింది.


ఈ విజయం తర్వాత రియా హర్షం వ్యక్తం చేసింది. తర్వాత తన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. రియా కిరీటం అందుకున్న తర్వాత మీడియాతో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ దక్కడం చాలా గర్వంగా ఉందని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఈ కిరీటం గెలిచేందుకు ఎంతో కష్టపడి ఇక్కడ మీ ముందు నిల్చున్నానని భావోద్వేగం వ్యక్తం చేసింది. గతంలో ఇలాంటి టైటిల్స్ నెగ్గిన ఎంతోమంది విజేతల నుంచి చాలా విషయాలు తెలుసుకొని ఫాలో అవుతూ వచ్చానని వెల్లడించింది.

ఈ టైటిల్ గెలవడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని రియా చెప్పింది. పోటీలు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఇందులో విన్నర్‌గా నిలవడం నా అదృష్టమన్నారు. అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు చాలా కష్టపడ్డానని, ఈ స్థాయికి రావడం వెనుక చాలా కృషి ఉందన్నారు. నా జీవితంలో ఎంతోమందిని స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పుకొచ్చింది. అనంతరం అందరికీ అభినందనలు తెలిపారు.


అలాగే, ప్రాంజల్ ప్రియ మొదటి రన్నరప్‌గా, ఛవీ వెర్గ్ రెండవ రన్నరప్‌గా నిలవగా.. సుస్మితా రాయ్, రూప్ ఫుజానో విసో తర్వాతి స్థానాల్లో నిలిచారు. అంతకుముందు, ఫైనల్‌ చివరి రౌండ్‌లో మొత్తం 10 మంది పోటీపడగా.. చివరికి రియా సింఘా విజేతగా నిలిచింది. ఇందులో స్విమ్సూట్, ఈవెనింగ్ గౌన్ వంటి విభాగాలతో సహా వివిధ రౌండ్స్ ప్రదర్శించారు.

ఇక, ఈ ఈవెంట్‌కు జడ్జి ప్యానెల్‌లో నిఖిల్ ఆనంద్చ నటి, మిస్ యూనివర్స్ ఇండియా 2015 ఊర్వశి రౌటెలా, వియత్నా మిస్ స్టార్ న్గుయెన్ క్విన్, ఫ్యాషన్ ఫోటో గ్రాఫర్ రియాన్ ఫెర్నాండెజ్, పారిశ్రామిక వేత్త రాజీవ్ శ్రీవాస్తవ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఊర్వశి రౌటేలా మాట్లాడారు. ఈ ఏడాది భారత్ మళ్లీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఈ పోటీల్లో అందరూ బాగా కష్టపడ్డారని, అందరి ప్రదర్శన అద్భుతమన్నారు.

Also Read:  ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు.. అమెరికా పర్యటనలో మోదీ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించిన రియా సింఘా.. తన మోడలింగ్ కెరీర్‌ను 2020లో ప్రారంభించారు. ఈ ఏడాది రియా ‘దివాస్ మిస్ టీన్ గుజరాత్ టైటిల్ కూడా కైవసం చేసుకుంది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2023లో భారత్ తరఫున రియా ప్రాతినిధ్యంగా వ్యవహరించింది. 25 మందితో పోటీ పడి 6వ స్థానంలో నిలిచింది. అనంతరం అదే ఏడాది ముంబైలో జరిగిన జాయ్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 14లో రియా సింఘా పాల్గొన్నారు. ఇందులో 19మందితో పోటీపడి రన్నరప్‌గా నిలిచింది. ఇక, తాజాగా, 2023 సెప్టెంబర్ 22న జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏకంగా కిరీటాన్ని సొంతం చేసుకున్న రియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 43వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

 

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×