BigTV English

Why KCR Silent: లడ్డూ వివాదాన్ని లైట్ తీసుకున్న కేసీఆర్? అందుకేనా నోరు మెదపడంలేదు?

Why KCR Silent: లడ్డూ వివాదాన్ని లైట్ తీసుకున్న కేసీఆర్? అందుకేనా నోరు మెదపడంలేదు?

Why KCR Silent: కారు పార్టీకి కొన్నివర్గాలు దూరమవుతున్నాయా? ఊహించని పరిణామాలు జరుగుతున్నా కీలక నేతలు ఎందుకు నోరెత్తలేదు? కేసీఆర్ సైలెంటే పార్టీ కొంప ముంచ్చుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్నివర్గాల ప్రజలు ఆ పార్టీపై కాసింత ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరిగినా తెలంగాణ రాజకీయ నేతలు నోరు ఎత్తుతారు. అలాగే తెలంగాణలో ఏమి జరిగినా ఏపీ అధికార పార్టీ నేతలు రియాక్ట్ కావడం కొద్దిరోజులుగా చూస్తున్నాం. కానీ పదేళ్లు అధికారం లో ఉన్న కేసీఆర్ సైలెంట్‌గా ఉండటాన్ని కొన్ని వర్గాల ప్రజలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా సెలైంట్‌గా ఉండడం మంచిదన్నది కేసీఆర్ ఆలోచన. ఇలాంటి అంశాల్లో రియాక్ట్ కాకపోతే ఒక్కోసారి పార్టీకి ఊహించని దెబ్బ తగులుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది.


తిరుమల లడ్డూ అంశం దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. ఈ వ్యవహారం వచ్చి దాదాపు నాలుగైదు రోజులు గడిచాయి. దీనిపై కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు నోరెత్తిన సందర్భంలేదు. లడ్డూ వ్యవహారం వైసీపీ హయాంలో జరగడంతో కారు పార్టీ సైలెంట్‌గా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.

ALSO READ: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

బీఆర్ఎస్ నేతలు ఏనాడూ వైసీపీని కానీ, జగన్‌ను నోరెత్తి ఒక్కమాట అన్న సందర్భం లేదు.. రాలేదు.. రాకపోవచ్చునేమో. దీనిపై రియాక్ట్ కాకూడదనే భావించినట్లుంది ఆ పార్టీ. ఈ విషయంలో కేసీఆర్‌ వ్యవహారశైలిని కొన్ని హిందూ వర్గాల ప్రజలు తప్పుబడుతున్నారు.

కేసీఆర్ అంటే ఆయనకున్న దైవ భక్తి మరొకరికి ఉండదని, యజ్ఞాలు, హోమాలు చేశారని చెబుతున్నారు. తిరుమలకు పోటీగా యాదాద్రిని పునర్ నిర్మించారు కూడా.  కేసీఆర్ అంతటి హిందూ వ్యక్తి మరొకరు ఉండరని ఆ పార్టీ నేతలే ఒక్కోసారి కితాబు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇంత జరుగుతున్నా తిరుమల లడ్డాపై నోరు ఎత్తలేదు పెద్దాయన.

లడ్డూ వ్యవహారంలో నోరెత్తితే హిందు ఓటు బ్యాంకు చేజారిపోతుందన్నది కారు పార్టీ అంచనా. అందుకే కారు పార్టీలోని నేతలెవరూ నోరు ఎత్తే సాహసం చేయలేదు. పైగా ఈ అంశాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేసేందుకు అమృత్ టెండర్ల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారట కేటీఆర్.

తెలంగాణ ప్రజలు మాత్రం తిరుమలలో ఏం జరుగుతోందనే దానిపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. తిరుమల లడ్డా వ్యవహారం కేవలం వైసీపీకి మాత్రమే కాదు, బీఆర్ఎస్‌కు బాగానే దెబ్బ తగిలినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో నేతలు చర్చించుకుంటున్నారు.

గతంలో చంద్రబాబు అరెస్ట్‌పై బీఆర్ఎస్ సైలెంట్‌గా ఉండటాన్ని కొన్నివర్గాల ప్రజలు గుర్తు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో మెజార్టీ సీట్లు కారు పార్టీ గెలుచుకున్నా, దాని ప్రభావం బీఆర్ఎస్‌కు బాగా పడిందని అంటున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×