E-Paper
Advertisement

Mr Bachchan Teaser Released: మాస్ జాతర.. టీజర్ ఏముంది గురూ.. మాస్ మహారాజ అల్లాడించాడుగా

Mr Bachchan Teaser Released: మాస్ జాతర.. టీజర్ ఏముంది గురూ.. మాస్ మహారాజ అల్లాడించాడుగా
Advertisement

Mr Bachchan Teaser Released: మాస్ మహారాజ రవితేజ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. అయినా ఒక్కటి కూడా అనుకున్నంత ఫలితం అందించలేకపోతుంది. అయినా రవితేజ ఎక్కడా తన సహనాన్ని కోల్పోలేదు. విజయపజయాలతో సంబంధం లేకుండా పలు సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అదే ‘మిస్టర్ బచ్చన్’.

క్రేజీ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రవితేజ సరసన అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ నటిస్తుంది. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘రైడ్’ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతుంది. అయితే పేరుకు రీమేక్ అయినా.. హరీశ్ శంకర్ ఈ స్టోరీని తన స్టైల్లో కాస్త మాస్ టచ్ ఇస్తూ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీలో రవితేజ.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అభిమానిలా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే ‘మిస్టర్ బచ్చన్’ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం.

Advertisement

కాగా ఇందులో రవితేజ ఒక నిజాయితీ గల ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌లను మేకర్స్ అందిస్తూ తమదైన శైలిలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సినిమాపై ఫుల్ బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సాంగ్స్ హైలైట్ అని చెప్పాలి. ఆ సాంగ్స్‌లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే రొమాంటిక్ లుక్స్, డాన్స్ అందరనీ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Also Read: రెప్పల్ డప్పుల్ కొట్టాలిలే.. థియేటర్ లో ఫ్యాన్స్ కు పూనకాలే

Advertisement

ఇక ఇప్పుడు మేకర్స్ మరో అప్డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మేరకు ఈ సినిమా టీజర్‌‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌‌లో రవితేజ మాస్ యాక్షన్ ఓ రేంజ్‌లో ఉందని చెప్పాలి. అలాగే బోర్సేతో మాస్ మహారాజ రొమాన్స్ చాలా క్యూట్ అండ్ స్వీట్‌గా కూడా ఉంది. అంతేకాకుండా అతడి డైలాగ్స్ వీర మాస్ లెవెల్లో ఉంటూ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి. ఒకరకంగా హరీశ్ శంకర్ సినిమాలంటే మాస్ యాక్షన్, డైలాగ్స్‌ను ఊహించుకోవచ్చు. ఇందులో కూడా అలాంటివే ఉన్నాయి. ఈ టీజర్‌‌తో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.

ఇక ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.40 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంతమేర జరగడం చాలా ఎక్కువనే చెప్పాలి. ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కులు, హిందీ డబ్బింగ్ యూట్యూబ్ హక్కులు ఇలా అన్ని కలుపుకుంటే అప్పుడే ఈ సినిమాకి లాభాల పంట పండినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఇందులో ఎంత నిజం ఉందో.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×