E-Paper
Advertisement

Jikki Song Released: రొమాంటిక్ మూడ్‌లో ‘మిస్టర్ బచ్చన్’.. జిక్కి సాంగ్ అదరిపోయిందంతే..

Jikki Song Released: రొమాంటిక్ మూడ్‌లో ‘మిస్టర్ బచ్చన్’.. జిక్కి సాంగ్ అదరిపోయిందంతే..
Advertisement

Jikki Song Released: రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, సత్య, సచిన్ ఖేడేకర్, నెల్లూరు సుదర్శన్ వంటి వారు కీలక పాత్రలు పోషస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ సినీ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.

ముఖ్యంగా ఈ సాంగ్స్‌లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన అందంతో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. నడుము ఒంపుసొంపులు చూపిస్తూ కుర్రకారును ఫిదా చేసింది. అంతేకాకుండా సాంగ్స్‌లో ఆమె ఎక్స్‌ప్రెసన్స్ అదిరిపోయాయనే చెప్పాలి. కాగా ఆమె టాలీవుడ్‌లో నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో అందరి చూపు ఆమెపైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతోంది. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన రైడ్ సినిమాకు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Advertisement

Also Read: సితార్.. చార్ట్ బస్టర్ అయ్యేలా ఉందే

ఈ సినిమాలో రవితేజ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇందులో అతడు పవర్ ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై రెండు సాంగ్‌లకు ఆడియన్స్ నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మేకర్స్ మరో అప్డేట్ అందించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘జిక్కి’ అంటూ సాగే మూడో సాంగ్‌ను విడుదల చేశారు. అందులో రవితేజ, భాగ్యశ్రీ రొమాంటిక్ సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

ముఖ్యంగా భాగ్యశ్రీ తన అందాలతో అదరగొట్టేసింది. వారిద్దరి కెమిస్ట్రీ అందరిలోనూ క్యూరియాసిటీ రేపుతోంది. ఈ సాంగ్‌ కూడా ప్రస్తుతం యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. మొత్తంగా ఈ సినిమా నుంచి విడుదలైన మూడు సాంగ్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. మరి ‘మిరపకాయ్’ వంటి సినిమాతో రవితేజకు బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్.. ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×