BigTV English
Advertisement

Mr. Bachchan: సితార్.. చార్ట్ బస్టర్ అయ్యేలా ఉందే

Mr. Bachchan: సితార్.. చార్ట్ బస్టర్ అయ్యేలా ఉందే

Mr. Bachchan: మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ హిట్ టాక్ అందుకున్న రైడ్ సినిమాకు.. మిస్టర్ బచ్చన్ రీమేక్ గా తెరకెక్కుతుంది.


ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, షో రీల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. మిస్టర్ బచ్చన్ మ్యూజికల్ ఫెస్టివెల్ ను మొదలుపెట్టారు. అందులో భాగంగానే నేడు మిస్టర్ బచ్చన్ నుంచి మొదటి లిటికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

ఇప్పటికే సితార్ సాంగ్ ట్యూన్ ప్రేక్షకలను మెప్పించింది. నేడు సితార్ ఫుల్ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయ్యేలానే కనిపిస్తుంది. రవితేజ- మెలోడీ సాంగ్స్ పర్ఫెక్ట్ కాంబో అని చెప్పొచ్చు. ఈ సాంగ్ కూడా అలానే వినిపిస్తుంది. గేయ రచయిత సాహితి అంధించిన లిరిక్స్ కు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ హైలైట్ గా నిలువగా.. సాకేత్, సమీరా తమ వాయిస్ తో సాంగ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లారు.


ఇక సినిమాలో హుక్ స్టెప్ చాలా వైరైటీగా ఉంది. శేఖర్ మాస్టర్ హుక్ స్టెప్స్ లిస్ట్ లో ఇది కూడా చేరిపోతుందని చెప్పాలి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే రవితేజ-భాగ్యశ్రీ కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కాశ్మీర్ అందాల నడుమ వీరి కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×