E-Paper
Advertisement

Ravi teja:- ‘రావణాసుర’ ఒరిజిన‌ల్ క‌థ కాదా.. రీమేకా! స్రీకెట్ దాచేసిన మేకర్స్?

Ravi teja:- ‘రావణాసుర’ ఒరిజిన‌ల్ క‌థ కాదా.. రీమేకా! స్రీకెట్ దాచేసిన మేకర్స్?
Advertisement

Ravi teja:- ర‌వితేజ తాజా చిత్రం ‘రావణాసుర’. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. మాస్ మ‌హారాజా హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుశాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇదొక సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తిక‌ర‌మైన క‌థ‌నం ఒక‌టి నెట్టిట వైర‌ల్ అవుతుంది. అదేంటంటే.. ‘రావణాసుర’ సినిమా ఒరిజిన‌ల్ స్టోరి కాద‌ట‌. ఓ బెంగాలీ సినిమాకు రీమేక్ అనే వార్త‌లు నెట్టిం జోరుగా షికారు చేస్తున్నాయి.

ఇంత‌కీ ఏ బెంగాలీ సినిమాకు ‘రావణాసుర’ రీమేక్ అని తెలుసా! ‘విన్సిడా’. అయితే మేకర్స్, డైరెక్టర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా ఆ విష‌యాన్ని చెప్ప‌లేదు. రీసెంట్‌గా రైట‌ర్ శ్రీకాంత్ విస్సాను ఓ ఇంట‌ర్వ్యూలో ఈ ప్ర‌శ్న అడిగితే ఆ సినిమా చూడండి.. ‘రావణాసుర’ చూడండి… అస్స‌లు సంబంధ‌మే ఉండ‌దు అని అన్నాడే కానీ.. ఒరిజిన‌ల్ క‌థ అని చెప్పుకోలేదు. అంటే బెంగాలీ సినిమా క‌థ‌నే మ‌న నెటివిటీకి, ర‌వితేజ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్లు మార్చేశార‌న్న‌మాట‌. మ‌రిప్పుడు నెట్టింట అస‌లు విష‌యం లీకైంది. మ‌రి దీనిపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Advertisement

‘రావణాసుర’ చిత్రంలో ర‌వితేజ క్రిమిన‌ల్ లాయ‌ర్ పాత్ర‌లో న‌టించారు. ఈ పాత్రలో ఆయ‌న న‌టించ‌టానికి కొంత మంది క్రిమిన‌ల్ లాయ‌ర్స్‌ని క‌లిసి వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంద‌నేది అబ్జ‌ర్వ్ చేసి మ‌రీ యాక్ట్ చేశార‌ట‌. అభిషేక్ పిక్చ‌ర్స్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్‌ హీరోయిన్స్‌గా న‌టించారు.

గత ఏడాది చివరలో ధమాకాతో బ్లాక్ బస్టర్ సాధించిన రవితేజ ఇప్పుడు రావణాసురతో సందడి చేయబోతున్నారు. మరో వైపు టైగర్ నాగేశ్వరరావు చిత్రం కూడా ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది.

Advertisement

సమంత ఇక ఇంటికేనా..? క్లారిటీ ఇచ్చిన శాకుంతలం

for more updates follow this link:-bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×