BigTV English
Advertisement

PKSDT:-PKSDT కోసం బండ్ల గ‌ణేష్ టైటిల్ వాడేస్తున్న త్రివిక‌మ్ర్‌?

PKSDT:-PKSDT కోసం బండ్ల గ‌ణేష్ టైటిల్ వాడేస్తున్న త్రివిక‌మ్ర్‌?

PKSDT:-ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. PKSDT అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను జూలై 28న విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. అంటే రీసెంట్‌గానే స్టార్ట్ చేసిన PKSDT ఇంత త్వ‌ర‌గా వ‌చ్చేస్తుందంటే కార‌ణం.. ప‌వ‌న్ అందించిన స‌పోర్ట్ అనే చెప్పాలి. త‌మిళంలో స‌ముద్ర ఖ‌ని హీరోగా న‌టిస్తూ డైరెక్ట్ చేసిన వినోద‌య సిత్తం సినిమాకు రీమేకే మ‌న PKSDT. త‌మిళంలో డైరెక్ట్ చేసిన స‌ముద్ర ఖనినే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నారు. ప‌వ‌న్ 20 రోజుల కాల్షీట్‌ను మాత్ర‌మే కేటాయించ‌టంతో ముందుగా ఆయ‌న‌పై చిత్రీక‌రించాల్సిన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేస్తున్నారు.


ఇదంతా బాగానే ఉంది. అయితే PKSDT కి తెలుగులో ఏ టైటిల్‌ను పెట్టాల‌నే దానిపై మేక‌ర్స్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ మేర‌కు ‘దేవ‌ర’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. అయితే ఈ టైటిల్‌ను రిజిస్ట‌ర్ చేద్దామ‌ని వెళితే అది మ‌రో నిర్మాత ద‌గ్గ‌ర ఉంది. దీంతో మేక‌ర్స్ ఇప్పుడా నిర్మాత‌ను కాంటాక్ట్ చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా కోసం రిక్వెస్ట్ వెళితే దాదాపు టైటిల్ వారికి దొరికేసిన‌ట్లే. నిజానికి ఈ దేవ‌ర అనే ప‌దాన్ని బండ్ల గ‌ణేష్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పిలుచుకోవ‌టానికి ఉప‌యోగిస్తుంటాడు. దేవ‌ర అంటే దేవుడు అని అర్థం. ఇప్పుడు బండ్ల గ‌ణేష్ ఉప‌యోగించే పేరునే త్రివిక్ర‌మ్..PKSDT పెట్టే ఆలోచ‌న‌తో ఉన్నారు.

PKSDT సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. భ‌క్తుడికి బుద్ధి చెప్ప‌టానికి దేవుడు భూలోకంలోకి వ‌స్తాడు. స‌మ‌స్య‌ల్లో ఉన్న భ‌క్తుడిని వాటి నుంచి బ‌య‌ట ప‌డేస్తాడు. అంటే ఇది దేవుడుకి సంబంధించిన క‌థ కావ‌టంతో దేవ‌ర అనే టైటిల్ అయితే బావుంటుంద‌ని త్రివిక్ర‌మ్ ఆలోచ‌న‌. పీపుమ‌ల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై మూవీ రూపొందుతోంది.


మనోజ్ పంచ్ డైలాగ్స్.. విష్ణునే టార్గెట్‌!.. ట్వీట్ వైరల్..

for more updates follow this link:-bigtv

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×