E-Paper
Advertisement

KTR: మెట్రో మరింత దూరం.. ఎల్బీనగర్‌ జంక్షన్లో గ్రీన్ పాస్..

KTR: మెట్రో మరింత దూరం.. ఎల్బీనగర్‌ జంక్షన్లో గ్రీన్ పాస్..
Advertisement

KTR: హైదరాబాద్ సిటీలోకి రావాలంటే.. ఎల్బీనగర్ నుంచే ట్రాఫిక్‎తో నరకం మొదలవుతుంది. కానీ.. ఇప్పుడు ఆ బాధ తప్పనుంది. ఎల్బీనగర్‎లో ఇప్పటికే సిటీ నుంచి బయటకు వెళ్లే రూట్లో ఫ్లై ఓవర్ మొదలు కాగా.. తాజాగా సిటీ లోకి వచ్చే రూట్లో ఫ్లైఓవర్ ప్రారంభమైంది. ఇక నుంచి ఎల్బీనగర్‌ జంక్షన్‌లో ఆగాల్సిన అవసరం లేదు. నేరుగా ఫ్లైఓవర్ మీదుగా సిటీలోకి ఎంటర్ అవ్వచ్చు. వనస్థలిపురం – దిల్‌సుఖ్ నగర్ మార్గంలో ఎల్బీనగర్ కూడలి దగ్గర నిర్మించిన ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి హయత్ నగర్ మీదుగా వచ్చే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 700 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు గల ఈ ఫ్లై ఓవర్ వలన వాహనాల వేగం కూడా పెరగనుంది. ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది.

Advertisement

SRDP ద్వారా చేపట్టిన 47 పనుల్లో.. ఇప్పటివరకు 35 పనులు పూర్తి కాగా.. వాటిలో పంతొమ్మిదవదైన ఎల్బీనగర్ RHS ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మిగతా శాఖలకు సంబంధించిన ఆరు పనుల్లో 3 పూర్తికాగా మరో 3 వివిధ దశల్లో ఉన్నాయి. ఎల్బీనగర్ RHS ఫ్లైఓవర్‎ను సివిల్ పనులు, యుటిలిటి షిప్టింగ్‎తో పాటు భూసేకరణతో సహా మొత్తం 32 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు.

ఫ్లైఓవర్ ఓపెనింగ్ సందర్భంగా మంత్రి కేటీఆర్ అనేక హామీలు ఇచ్చారు. నాగోల్ మెట్రోను ఎల్బీనగర్ వరకు పొడిగిస్తామన్నారు. ఎల్బీనగర్ మెట్రోను హయత్‌నగర్ వరకు విస్తరిస్తామని చెప్పారు. ఎల్బీనగర్ సెంటర్‌కు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి పేరు పెడతామని ప్రకటించారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×